👉సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సవాలు హాస్యాస్పదం.!
👉ఎమ్మెల్యే.. సీఎం పదవి ఒక్కటేనా ?
👉పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!
J.SURENDER KUMAR,
కేటీఆర్ ఎంపి గా నిజామాబాద్ లేదా కరీంనగర్ నుండి పోటీ చేసే దమ్ముందా ? ఉంటే పోటీ చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి సవాలు విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సవాల్ చేయడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యే సీఎం ఒకటేనా ? బీఆర్ఎస్ ఒక్కస్థానం గెలిచే అవకాశం కూడా లేనప్పుడు మాట్లాడే తీరు ఇదేనా.. అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
👉దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేసి రావాలని కేటీఆర్ సవాలు విసరడం పై నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. వాస్తవాలు తెలుసుకో కేటీఆర్, ఉంటూ హితవు పలికారు.
👉రెండు టీఎంసీ లు ఉపయోగించకుండా అదనపు టీ ఎం సీ ల కోసం క్రిమినల్ నేరమని అన్నారు.
👉తుమ్మడి హెట్టీ వద్ద 160 టీఎంసీ ల నీరు లభ్యం ఉందని నివేదిక ఉండగా తుమ్మడి హేట్టి నుండి కిందికి దించటానికి మరో నివేదికలో సైతం ఇచ్చారు
👉148 మీటర్ల ఎత్తు బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకుంది. ఒక్క లిఫ్ట్ తో ఎల్లంపల్లి కి నీరు చేరేది..
👉వేదిర శ్రీరామ్ నివేదిక ఇచ్చారు.
👉మెడి గడ్డ పిల్లర్లు కుంగడం టెక్నికల్ లోపం అని పేర్కొంటున్నారు..ఇకనైనా జ్ఞానోదయం చేసుకో..
👉ఉచిత బస్సు రవాణా నూరుశాతం విజయవంతం అయింది.
👉అడ బిడ్డలను గౌరవించడం హిందూ సంప్రదాయం.
👉అడబిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు.నేటి నుండి గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలు చేస్తున్నాం..
👉ప్రజా పాలనలో ధరకాస్తు చేసుకున్న వారందరికీ 200 యూనిట్ల మాఫీ వర్తిస్తుంది..
👉రేషన్ కార్డు ఉన్న వారు ఎవరైనా ప్రజా పాలనలో ధరకాస్తు చేసుకొని వారు తక్షణమే ధరకాస్తు చేసుకోవాలని సూచించారు.
👉రేషన్ కార్డు లేని వారికి రెండు నెలల్లో రేషన్ కార్డు జారీ. చేస్తామని అన్నారు.
గ్యాస్ కంపెనీలకు ముందే డిపాజిట్ చేస్తున్నాం..సిలిండర్ ధర ఎంత ఉన్నప్పటికీ
👉₹ 500/- సిలిండర్ అందుతుంది.
నేటితో మూడు గ్యారంటీలు అమలు చేసినం..
ఇండ్ల నిర్మాణాలపై వారం రోజుల్లో నిబంధనలు అమలు పై ప్రకటన చేస్తామన్నారు.
👉అర్హులైన ప్రతి ఒక్కరికీ పార దర్షకంగా ఇళ్ల కేటాయింపు అమలు చేస్తాం..
గత ఏడాది ఫిబ్రవరిలో విద్యుత్ వినియోగం కన్నా ప్రజలు ఈ ఏడాది అధికంగా వినియోగించారు.
👉ఇకనైనా కేటీఆర్ స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హితవు పలికారు. అనంతరం పోచంపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ లో చేరగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.