ఎల్ఐసి సంస్థ డబ్బులు చెల్లించాల్సిందే !

👉వినియోగదారుల ఫోరం తీర్పు!

J.SURENDER KUMAR,

పాలసీ హక్కుదారునికి, జీవిత బీమా సంస్థ ( ఎల్ఐసి ) చెల్లించాల్సిన డబ్బులకు వడ్డీతో కలిపి ఇవ్వాల్సిందే కరీంనగర్ జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి స్వరూప రాణి , సభ్యులు నరసింహారావు, శ్రీలత. ఎల్ఐసి సంస్థను ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.


వివరాలు ఇలా ఉన్నాయి.

జగిత్యాల పట్టణం కు చెందిన ఊరడి శ్రీనివాస్ ఎల్ఐసి జీవన్ ఆరోగ్య. పాలసీ ని 2015, ఫిబ్రవరిలో తీసుకున్నాడు. సంవత్సరానికి ప్రీమియం ₹. 4,782. చెల్లించాడు. ఈ పాలసీ గడువు, 2048 ఫిబ్రవరి మాసం వరకు ఉంది. ఇట్టి పాలసీ లాప్స్ కాకుండా సజీవంగా ఉంది.

పాలసీదారుడి కాలు కు నొప్పి కావడంతో 10-06-2015 న జగిత్యాల ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్ళాడు. వైద్యులు హైదరాబాద్ లో వైద్యం చేయించుకోవాలని చెప్పారు. 11-06-2015 న హైదరాబాద్ లోకామినేని ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకొని 12-06-2015 న డిశ్చార్జ్ అయ్యాడు. వైద్యం బిల్లు ₹ 43,557/- కోసం ఎల్ఐసి సంస్థకు దరఖాస్తు చేసుకోగా. వారు నీవు 52 గంటల సమయానికి తక్కువ ఆసుపత్రిలో ఉన్నందున నీకు ఇట్టి బిల్లు డబ్బులు చెల్లించమని ఎల్ఐసి సంస్థ వారు అట్టి బిల్లును తిరస్కరించారు.

బాధితుడు శ్రీనివాస్. జగిత్యాల పట్టణం కు చెందిన ప్రముఖ న్యాయవాది మెట్ట మహేందర్ ద్వారా 25/05/2016 న వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేశాడు. న్యాయవాది మహేందర్, ఎల్ఐసి సంస్థా న్యాయవాది వాదనలు, పూర్వపరాలు పరిశీలించిన ఫోరం న్యాయమూర్తి, వినియోగదారునికి చెల్లించాల్సిన.₹ 43,557/- కు తేదీ 7-03- 2024 నాటి వరకు ₹ 9% వడ్డీతో కలిపి చెల్లించాలని, ఖర్చుల నిమిత్తం ₹ 5000/- శ్రీనివాస్ కు చెల్లించాలని ఎల్ఐసి సంస్థను ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.