లోక్ సభ ఎన్నికల విధులలో 4544 మంది ఉద్యోగులు !

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులను 4544 మంది ఉద్యోగుల నిర్వహించనున్నారని కలెక్టర్  షేక్ యాస్మిన్ భాష అన్నారు.
లోకసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం  పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.

కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పోలింగ్ సిబ్బంది  మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.


ప్రిసైడింగ్ అధికారులు(పీ.ఓ), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏ.పీ.ఓ)లను, ఇతర పోలింగ్ అధికారులు (ఓ.పీ.ఓ)లను ర్యాండమైజెషన్ నిర్వహించారు. రిజర్వ్ సిబ్బందిని కలుపుకుని జిల్లా పరిధిలోని మూడు సెగ్మెంట్లకు గాను మొత్తం 4544 మంది పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ జరిపారు. వీరిలో పీ.ఓలు 1136 మంది,  ఏ.పీ.ఓ లు 1136 , ఓ.పీ.ఓలు 2272 మంది ఉన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్ చే పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు


దీనిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ విధుల కోసం నియమించబడిన సిబ్బందికి తక్షణమే ఉత్తర్వులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో ఆర్డీఓ లు మధుసూదన్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలన అధికారి హన్మంతు రావు, సంబంధిత తహశీల్దార్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు హకీమ్, తదితరులు పాల్గొన్నారు.