మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి ఉత్సవాలకు పోటెత్తిన అభిమానులు !

👉రవీంద్ర భారతి హాల్ తలుపులు మూసివేత !

👉రవీంద్ర భారతి ముందు ట్రాఫిక్ జామ్.

J.SURENDER KUMAR,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్ధిల్ల శ్రీపాదరావు  జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి తెలంగాణ వ్యాప్తంగా ఆయన అభిమానులు హైదరాబాద్  కు తరలి రావడంతో శనివారం సాయంత్రం రవీంద్ర భారతి పోటెత్తింది. అభిమానుల తాకిడి తట్టుకోలేక, సమావేశ మందిరంలో స్థలం లేకపోవడంతో  నిర్వాహకులు రవీంద్ర భారతి సమావేశ మందిర  ప్రవేశ ద్వారాలను మూసివేశారు.


సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారతిలో  జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాదా మంత్రులు ,ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ పార్టీల కతీతంగా రవీంద్ర భారతి కి తరలి రావడంతో సమావేశ మందిరం, ప్రాంగణం పోటెత్తింది. అభిమానుల తాకిడికి. విధి లేని పరిస్థితులు నిర్వాహకులు రవీంద్ర భారతి ప్రవేశ ద్వారాలను మూసివేశారు.

మంత్రుల ఎమ్మెల్యేల వీఐపీల వాహనాలతో రవీంద్ర భారతి ముందు రహదారులు వాహనాలతో జామయ్యాయి. వాహనాలు బంపర్ టు బంపర్ గా నెమ్మదిగ కదులుతున్నాయి ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం శ్రమిస్తున్నారు.