👉జైలు సెంటిమెంట్ కలిసి వచ్చేనా ..
J.SURENDER KUMAR,
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారాల తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ముఖ్యమంత్రి యోగం పట్టనున్నదా ? అంటే సీఎం యోగం పట్టవచ్చు అనే మొదలైంది. ఈ చర్చకు జైలు సెంటిమెంట్ ప్రధాన కారణమైంది.
👉వివరాల్లోకి వెళితే
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి , కెసిఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష కోసం కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళుతుండగా పోలీసులు అలుగునూర్ వద్ద 2009 నవంబర్ లో అరెస్టు చేసి ఖమ్మం కు తరలించారు. స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీరామ్ మూర్తి, కెసిఆర్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. శాంతి భద్రతల నేపథ్యంలో కెసిఆర్ ను హెలికాప్టర్లో ఖమ్మం నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. స్వరాష్ట్రం సిద్ధించడంతో 2014 జూన్ 2న కెసిఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ప్రజా పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని 2015 లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో ఇరికించి మే మాసంలో అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రేవంత్ రెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జైలు నుంచి బయటికి వచ్చిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, కెసిఆర్ నిరంకుశ పాలనా, ప్రభుత్వ అవినీతి అక్రమాల పై ప్రజాక్షేత్రంలో రాజీ లేని పోరాటం, ఆందోళన చేస్తూ 2023 డిసెంబర్ ఎన్నికల్లో కెసిఆర్ ను, ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి. కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తెచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
👉సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి!
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైయస్ జగన్ పై ఆదాయానికి మించిన ఆస్తులు, తదితర అవినీతి ఆరోపణల నేరలు మోపుతూ 16 నెలలపాటు హైదరాబాద్ జైలులో నిర్బంధించారు. వైయస్సార్ పార్టీ పెట్టుకొని 2014 ఎన్నికల విడిపోయిన ఏపీలో పోటీ చేసి స్వల్ప ఓట్ల శాతంతో పార్టీ ఓటమి చెందింది. 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి 151 ఎమ్మెల్యే సీట్లతో భారీ విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగుతున్నారు.
ఎమ్మెల్సీ కవిత 2014 లో నిజాంబాద్ ఎంపీగా విజయం సాధించి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అదే నియోజకవర్గ నుంచి ఓటమి చెందారు. స్థానిక సంస్థలు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితురాలిగా ఆమె ఈడి, సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు. మార్చి 15 న హైదరాబాదులో ఎమ్మెల్సీ కవిత ఇంటిలో ఈడి అధికారులు సెర్చ్ వారెంట్ తో సోదాలు చేసి కవితను అరెస్టు చేసి ఢిల్లీ ఈడి, ప్రధాన కార్యాలయానికి తరలించారు. శనివారం, 16 న ఢిల్లీలోని రస్ అవెన్యూ కోర్ట్ ఎమ్మెల్సీ కవిత ను విచారణ నిమిత్తం వారం రోజులపాటు ఈడి కస్టడీ కి అప్పగించింది.
ఒకవేళ జైలు సెంటిమెంట్ పునరావృతం అయితే, తెలంగాణలో కెసిఆర్, రేవంత్ రెడ్డి లకు దక్కిన సీఎం యోగం కవితకు దక్కవచ్చని చర్చ జోరందుకోంది.