J.SURENDER KUMAR,
నిజామాబాద్ లో పసుపు సాగు 2019 లో 50 వేల ఎకరాల నుండి నేడు 19 వేల ఎకరాలకు తగ్గింది. అని పట్టభద్రులఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
పసుపు సాగుతో గిట్టుబాటు కాక రైతులు సాగు చేయడం తగ్గించుకుంటున్నారు నిజంగా పసుపు రైతులను ప్రధాని మోడీ ఆదుకోవాలంటే పసుపు క్వింటాల్ కు మద్దతు ధర ₹15000 ఇస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇందిరా భవన్ లో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మేల్యే ప్రభుత్వ విప్ అడ్లురీ లక్ష్మణ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో ఇలా అన్నారు.
తెలంగాణ లో బిజెపి అకౌంట్ కూడా ఓపెన్ కాదు.. కాళేశ్వరం అవినీతికి ఆస్కారం ఇచ్చింది మోడీయే..రాజకీయాలకు అతీతంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని ఉద్యమం సాగుతుంటే స్పందించడం లేదు..
పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం 2023 అక్టోబర్ లో జీఓ వెలువడింది..ఎక్కడ ఏర్పాటు చేస్తారు..సభ్యులను నియమించలా వద్దా చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు. 2019 లో పసుపు బోర్డ్ ఏర్పాటు చేస్తామని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.. ఐదేళ్లు గడిచాయి..పసుపు బోర్డు ఏర్పాటు ఒక్క అడుగు ముందుకు పడలేదు..షుగర్ ఫ్యాక్టరీ గురించి మోడీ మాట్లాడటం ఆశ్చర్యం కల్గిస్తుంది..నిన్నటి వరకు అధికారంలో ఎవరు ఉన్నారు..ఖాయిల పడిన పరిశ్రమలు తెరిచే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది.
2001-2002 లో షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగింది..అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం , బిజెపి మిత్ర పక్షంగా ఉన్నది నిజం కాదా..షుగర్ ఫ్యాక్టరీ ని బిజెపి ఎం పి కొనుగోలు చేశారు.. మోడీ కి ఈ విషయం తెలుసా..
నిన్నటి వరకు బీఆర్ఎస్ బిజెపి ఆలాయ్ బలాయ్ తీసుకున్నయి.షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం చేయాల్సిన బాధ్యత లేదా..
మోడీ పాలన రెండు సార్లు చూసిన ప్రజలు..ఇక చాలు..అంటున్నారు..కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.చక్కర కర్మాగారం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.ప్రైవేటు పరం చేసింది టీ డీ పీ- బిజెపి..బీ ఆర్ ఎస్ మూసివేసింది. ప్రతి శాసన మండలి సమావేశంలో చక్కర కర్మాగారం పై నేను మాట్లాడాను.కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కి కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాదా..
కాళేశ్వరం ప్రాజెక్టు కు రుణం ఇచ్చింది పవర్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ కాదా..ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కాదా..కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అనుమతులు లేకుండా నిర్మాణం చేపడితే, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది మోడీ కాదా అని ప్రశ్నించారు. కెసిఆర్ అవినీతి కి మార్గం సుగమం చేసింది మోడీ..
కాళేశ్వరం పై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ న్యాయ విచారణ కు కమిటీ వేసింది.అని జీవన్ రెడ్డి అన్నారు.