పంట పొలాలకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J. SURENDER KUMAR

వెల్గటూర్, ఎండపల్లి మండలంలోని దాదాపు పది గ్రామాలకు చెందిన పంట పొలాలకు మంగళవారం రాత్రి ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సాగునీరు విడుదల చేశారు.


రైతాంగానికి సాగు నీరు అందించే వేమునుర్ పంప్ హౌజ్ కు సంబందించిన వాల్ తొలగించి విడుదల చేశారు.


ఈ సంధర్బంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
..


గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో పంప్ హౌజ్ మోటార్లు చెడిపోయిన విషయం చెప్పకుండా రైతులను ప్రలోభ పెట్టారని ఆరోపించారు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాంత ఎమ్మెల్యే గా తనను గెలిపించిన తర్వాత ఈ ప్రాంత రైతులకు సాగునీటి విషయంలో శాశ్వత పరిష్కారం చూపే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. నియోజకవర్గ రైతాంగానికి సాగు నీరు అందించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించినట్టు లక్షణ్ కుమార్ తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి , సంబంధిత మంత్రి ద్వారా ఇరిగేషన్ అధికారులకు నీటి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు.


గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ కు చిత్తశుద్ది ఉంటే ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీరు అందించే విషయంలో శాశ్వత పరిష్కారం చూపించలేదని, లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చేయడం చేస్తున్నాడని ఆరోపించారు కళ్ళ ఎదుటే గోదావరి ఉన్న వాల్ ద్వారా అందించే నీటిపైన రైతాంగం ఆధారపడాల్సి వస్తోందనీ, అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో జరిగిందని ఆరోపించారు.2016 లో స్వయంగా ముఖ్యమంత్రి ధర్మపురి నియోజక వర్గంలో పత్తిపాక రిజర్వాయర్ నీ ఏర్పాటు చేసి ఉమ్మడి వెల్గటూర్, ధర్మారం మండలాలకు సాగు నీటినీ అందిస్తానని మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఎల్లంపెల్లి పైప్ లైన్ ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగు నీరు అందిస్తామని, రైతులకు సాగు నీరు అందించే విషయంలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.