పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఎవరు ఎవరికి ఇస్తారో ?

J.SURENDER KUMAR,

పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో ? మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ , చెన్నూర్ ఎమ్మెల్యే కు మరోసారి గిఫ్ట్ ఇస్తారో తెలియాలి అంటే జూన్ మొదటివారం వరకు వేచి చూడాల్సిందే.
పెద్దపల్లి ఎంపీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, బిజెపి అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్, ఆయా పార్టీలు ప్రకటించాయి. గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వంశీ కృష్ణ పేరు అధికారికంగా ప్రకటించింది.

👉రిటర్న్ గిఫ్ట్ ఎందుకు అంటే..


2018 అసెంబ్లీ ఎన్నికల వరకు గులాబీ ప్రభుత్వ లో సలహాదారుడిగా ఉన్న వివేక్ వెంకటస్వామి, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఫైనల్ అయింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాడు ప్రభుత్వ విప్ గా ఉన్న కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ పై దాదాపు ఓటమి అంచు వరకు వెళ్లి 441 స్వల్ప ఓట్లతో గెలిచారు. తన ఓటమి కోసం వివేక్ వెంకటస్వామి పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ కు సహాయ సహకారాలు ఇచ్చాడు అంటూ తాను, తన అనుచర వర్గంతో బహిరంగంగానే ఆరోపణలు చేశారు. దీంతోపాటు గులాబి అధినేత వద్ద లాబింగ్ చేసి చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన వెంకటేష్ నేతను గులాబీ పార్టీలో చేర్పించి పెద్దపల్లి టిఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇప్పించి వివేక్ కు. షాక్ ఇచ్చారు. వివేక్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.

,👉మొదటి రిటర్న్ గిఫ్ట్ లక్ష్మణ్ కుమార్ ఇచ్చాడు..

2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన లక్ష్మణ్ కుమార్ , ఓట్ల లెక్కింపులో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని హైకోర్టును. ఆశ్రయించిన విషయం తెలిసిందే . విచారణ కొనసాగుతుండగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచర వర్గం. లక్ష్మణ్ కుమార్ పట్ల చులకనగా, వ్యంగంగా సోషల్ మీడియాలలో పోస్ట్లు పెట్టడం. ‘ఈశ్వర్ కు గెలవడం అలవాటు, లక్ష్మణ్ కుమార్ కు ఓడిపోవడం అలవాటు’ అంటూ సభలు సమావేశాలలో పలు సందర్భాల్లో లక్ష్మణ్ కుమార్ ను, ఆయన అనుచర వర్గం ను హేళన చేసేవారు.
2023 డిసెంబర్ ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ క్యాడర్ కసితో రాత్రి పగలు కష్టపడి ఇరువది రెండూ వేల ఓట్ల మెజార్టీతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓడించి 2018 తన ఓటమినాటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తో లక్ష్మణ్ కుమార్ కు విప్ పదవి వరించింది.
(మాజీ మంత్రి ఈశ్వర్ అనుచరులు కొందరు లక్ష్మణ్ కుమార్ ను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతూ ఆయను ఆయన అనుచర వర్గాన్ని ప్రాధేయ పడుతున్న విషయం తెలిసిందె.)

👉గిఫ్ట్ కు రిటర్న్ గిఫ్ట్ తప్పదా ?

2019 పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అధిష్టానం వివేక్ కు పెద్దపల్లి టిక్కెట్ ఇవ్వకుండా లాభింగ్ చేసిన చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బాల్క సుమన్, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ కు కాంగ్రెస్ క్యాడర్ వారికి ఓటమి గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసింది.
వివేక తనయుడు గడ్డం వంశీ కృష్ణ పెద్ద పల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావడంతో కాంగ్రెస్ క్యాడర్ బి ఆర్ ఎస్ నుంచి ఎంపీ గా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఎంపీ ఎన్నికల్లో మరోసారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.