j.Surender Kumar.
పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు వంశీకృష్ణ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినట్టు సమాచారం.
మంగళవారం కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ కర్గే అధ్యక్షతన సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర ఇంచార్జ్ దీపా దాస్ మున్షి తో పాటు కీలక నేతలు సమావేశంలో పాల్గొననున్నారు.
సోమవారం రాత్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ హైదరాబాద్ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును, కలసి పెద్దపెల్లి పార్లమెంట్ టిక్కెట్ కోసం తన కొడుకు వంశీకృష్ణ పేరు ను సిఫారసు చేయవలసిందిగా చర్చించినట్లు సమాచారం. రామగుండం ఎమ్మెల్యే, రాజ్ ఠాకూర్ మక్కా సింగ్ కూడా చర్చల్లో పాల్గొనట్టు తెలిసింది. మంగళవారం ఉదయం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ధర్మపురి కి చేరుకొని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చర్చించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ దంపతులు ఎమ్మెల్యే వివేక్ ను సన్మానించారు.

దీనికి తోడు సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ముంబాయికి రాహుల్ గాంధీ న్యాయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడినుండి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ చేరుకొని రాష్ట్ర ఇంచార్జ్ దీపా దాస్ మున్షి తో కలిసి ప్రియాంక గాంధీని రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నుండి మారుతున్న పెద్దపల్లి పార్లమెంట్ రాజకీయ ముఖచిత్రం నేపథ్యంలో ఎమ్మెల్యేలను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కలసి చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉండగా పెద్ద పల్లి పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీకి . ఈట్ ఫర్ కేక్ లాంటిది అనేది జగమెరిగిన సత్యం. పార్లమెంట్ పరిధిలోని ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని, మంచిర్యాల్, చెన్నూర్ , బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ ఓట్ల మెజార్టీతో వ్యక్తిగత ఇమేజ్ తో పాటు పార్టీ ఇమేజ్ తో విజయం సాధించిన విషయం తెలిసిందే. 17 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కేవలం నలుగురు అభ్యర్థులనే ప్రకటించింది. మరో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ పార్లమెంటుకు బిజెపి, బిఆర్ఎస్ ,పార్టీలు వారి వారి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరును ఏఐసిసి అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
,