👉ప్రణాళికతో రానున్న లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలి !
👉 జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ !
J.SURENDER KUMAR,
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.
ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేర విచారణ మరింత సమర్ధవంతంగా, అన్ని స్థాయిలలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ముందుకు సాగాలని అన్నారు.పోలీసు స్టేషన్లలో నమోదయ్యే ప్రతీ కేసు వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఎస్పీ లు, సి.ఐ లు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లలో నమోదైన వివిధ రకాల కేసులు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్.ఐలకు కేసుల దర్యాప్తు కు సంబంధించి నా సూచనలు ఇవ్వాలని సూచించారు.
పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయధికారులతో సమన్వయం పాటిస్తూ భాదితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు. బ్లాక్ స్పాట్స్ (రోడ్డు ప్రమాదాల ప్రమాదాలు అధికముగా జరుగు ప్రదేశాలు) గుర్తించి పంచాయతీ రాజ్ మరియు ఆర్&బి ప్రభుత్వం శాఖల సమన్వయంతో ప్రమాదాల నివరణ పై దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల నుండి వచ్చే గంజాయి, సరఫరా చేసే వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి రవాణా ను పకడ్బందీగా నియంత్రించాలన్నారు.

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తు ముందుకు సాగుతుంది అన్నారు. వివిధ జిల్లాల వారీగా నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను, కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో, కలశాలలో గంజాయ ,మత్తు పధార్థాలకు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల కేసు విచారణ విజయవంతంగా పూర్తి అయి సకాలంలో బాధితులకు న్యాయం జరుగుటకు ఆస్కారం వుంటుంది అన్నారు. జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో రాబోవు లోక్ సభ ఎన్నికలు జరిగేలా ప్రతీ ఒక్క అధికారి ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేయాలనీ సూచించారు. జిల్లాకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రానీయకుండా పకడ్బందీగా చెక్ పోస్టు ల నిర్వహణ ఉండాలనీ అన్నారు.
ఈ సమావేశంలో ASP శివం ఉపాధ్యాయ, డీఎస్పీలు రఘు చందర్, ఉమామహేశ్వర రావు, రంగా రెడ్డి, DCRB, CCS, SB, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, నాగేశ్వర రావు, రఫీక్ ఖాన్, మరియు సి.ఐ లు, ఎస్.ఐ లు, DCRB, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.