👉ఏ రాష్ట్ర పోలీసులు అయినా చట్టబద్దంగా విధులు నిర్వహించాలి !
👉తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి !
👉పౌర హక్కుల సంఘం 50 వసంతాల సభలో తీర్మాణం!
👉ప్రొఫెసర్ హర గోపాల్!
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచుపల్లి గ్రామానికి చెందిన పోగుల రాజేశం ను ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జైల్ నుండి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పౌర హక్కుల సంఘం 50 వసంతాల సభలో తీర్మానం చేశారు. తీర్మాణం చేశారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హర గోపాల్ స్వయంగా పోగుల రాజేశం కుటుంబ సభ్యులను పరామర్శించి వాస్తవ విషయాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్ర పోలీసులు అయినా చట్ట బద్దంగా మెదల వలసిందేనని ప్రొఫెసర్ హర గోపాల్ అన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు చేస్తున్న అరాచకాలపై తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పౌర హక్కుల సంఘం యొక్క 50 వసంతాల సభలు జరిగాయి.

పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోశాధికారి అయిన పోగుల రాజేశంను గత ఫిబ్రవరి 11న జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామం నుండి అక్రమంగా, ఎలాంటి సమాచారం లేకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడాన్ని ఈ సభలో తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా ఛత్తీస్ ఘడ్ పోలీసులు నేటికీ రాష్ట్రంలోని ప్రజలను అక్రమంగా ఎత్తుకెళ్లి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ఈ పద్దతి పూర్తిగా చట్ట విరుద్ధం అన్నారు. స్థానిక ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టం చేసి అడ్డుకోవాలని హర గోపాల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పోగుల రాజేశం విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించి తగు చర్యలు తీసుకొని రాజేశం విడుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పోగుల రాజేశం భార్య మల్లేశ్వరి, కొడుకు శ్రీనివాస్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి, మార్వాడి సుదర్శన్, చుక్క గంగారెడ్డి తదితరులు ఉన్నారు.