ప్రముఖ న్యాయవాది హనుమంతరావు కన్నుమూత!


J.SURENDER KUMAR,


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రముఖ సీనియర్ న్యాయవాది, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి మాకునూరి హనుమంత రావు ( 90 ) శుక్రవారం జగిత్యాల స్వగృహంలో కన్నుమూశారు.


1961 లో న్యాయవాద వృత్తి చేపట్టిన హనుమంతరావు, సివిల్ తగాదాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ‘మాస్టర్ మైండ్ ‘ గుర్తింపు ఉంది. కొన్ని కేసులలో పలువురు జూనియర్ న్యాయమూర్తులు హనుమంతరావు సలహాలు, తీసుకునేవారని న్యాయవాదులు పలు సందర్భాలు చర్చించుకుంటారు.

2021 కోవిడ్ వరకు హనుమంతరావు కోర్టుకు వెళ్లేవారు. ఉమ్మడి కరీంనగర్ బార్ అసోసియేషన్ హనుమంతరావు ను గతం లో ఆయనను సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పేరిట ఘనంగా సన్మానించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, ప్రజా ప్రతినిధులతో. స్నేహ సంబంధాలను కొనసాగించినా ,వివాద రహితుడిగా హనుమంతరావు కు ప్రజలలో గుర్తింపు ఉంది. గత రెండు రోజుల వరకు ఆయన తన జూనియర్ న్యాయవాదులకు సలహాలు సూచనలు ఇచ్చారు. హనుమంతరావు కు ఇద్దరు కుమారులు, కూతురు మరో కుమారుడు, అల్లుడు, మనవడు, హైకోర్టు న్యాయవాదులు


శుక్రవారం రాత్రి 8 గంటల జగిత్యాల పట్టణంలో హనుమంతరావు పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హనుమంతరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.