J.SURENDER KUMAR,
ప్రముఖ పాత్రికేయులు, రచయిత, అనువాద సాహిత్య ప్రముఖులు గుండు వల్లీశ్వర్ ప్రతిష్టాత్మక నేషనల్ బుక్ ట్రస్ట్ బోర్డు ట్రస్టీగా, మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా నియమితులయ్యారు. ఈయన పదవీ కాలం మూడు సంవత్సరాలు.
వల్లీశ్వర్ ఈనాడు పత్రిక లో ముఖ్యమైన పదవులు నిర్వహించారు. ఈనాడు ఢిల్లీ విభాగం లో సేవలు అందించారు. వల్లీశ్వర్ స్వర్గీయ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా, ఆంధ్రప్రదేశ్ పత్రిక ముఖ్య సంపాదకులుగా సేవలందించారు.
2013 డిసెంబర్ లో ధర్మపురి కి వచ్చి” ఉప్పు ” పక్షపత్రిక ను ఆయన ప్రారంభించారు.

వల్లీశ్వర్ అనువాద సాహిత్యం లో తనదైన ముద్ర వేసారు. తెలుగు లో వచ్చిన నరసింహుడు, జుగల్బంది, రాతిగోడల వెనుక లాంటి ప్రఖ్యాత పుస్తకాలు ఈయన అనువదించినవే. ఈయన రచించిన మరికొన్ని పుస్తకాలు మోడీ@20 ఏళ్ళు, వైఎస్ఆర్ ఛాయలో, 99 కథలు, నర్సరీ రాజ్యానికి రారాజు పల్ల వెంకన్న మొదలైనవి .
.ఇంకా ఎన్నో పుస్తకాలు, కథలు, వ్యాసాలు ఈయన కలం నుండి పాఠకులను అలరించాయి. మల్లీశ్వరి నియామకం పట్ల రచయితలు సాహిత్య వేత్తలు, పలు జర్నలిస్టు సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.