J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో భాగంగా బుధవారం రాత్రి జరిగిన పుట్ట బంగారం పూజా కార్యక్రమంతో జాతరకు అంకురార్పణ జరిగింది.
స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…
ముందు గా శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
ధర్మపురి శాసన సభ్యుడిగా గెలిచిన మొదటి సారి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి బ్రహ్మోత్సవాలలో భాగమైన పుట్ట బంగారం కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. స్వామీ వారి ఆశీస్సులు ధర్మపురి నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళల ఉండాలని ఈ సందర్భంగా కోరారు

ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు జక్కు రవీందర్ బృంద సభ్యులు, వేదపండితుడు బొజ్జ రమేష్ శర్మ, ప్రధాన అర్చకుడు నంది శ్రీనివాసాచార్యులు భక్తజనం తదితరులు పాల్గొన్నారు.