23 వేల మత్స్యకార కుటుంబాల ఖాతాలలో ₹ 161. కోట్లు జమ!

👉సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..

J.SURENDER KUMAR,

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు ₹ 11,500 చొప్పున 6నెలలకు గాను ₹ 69,000, మొత్తం ₹ 161.86 కోట్లను మంగళవారం సేవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి ఖాతాలో జమ చేశారు.ఇప్పటివరకూ ఐదు విడతల్లో ₹ 647.44 కోట్ల రూపాయలు జమ చేశారు


ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ..


👉రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ కూడా మంచి మనసుతో, సాకులు చూపించకుండా ప్రోయాక్టివ్‌గా కలిసి వచ్చి ఇందులో భాగస్వామ్యులయ్యారు.ఐదో విడతగా ఈరోజు ఈ సాయాన్ని అందిస్తున్నాం.


👉ఒక్కోక్క మత్స్యకార కుటుంబానికి నెలకు ₹.11,500 చొప్పున అందిస్తున్నాం. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారు కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఈ అడుగులు వేస్తున్నాం.


👉ఎమ్మెల్యే సతీష్‌, క్రమం తప్పకుండా డబ్బు విడుదలకు ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సతీష్‌ను అభినందించాలి. అధికారులు కూడా చొరవగా ముందుకు అడుగులు వేసి మత్స్యకారులను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారు.


👉మత్స్యకారులకు అందించే ఈ ఐదోవిడత సహాయం కింద దాదాపు ₹162 కోట్లను 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్నాం. కార్యక్రమంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం. ఇప్పటివరకూ ఐదు విడతల్లో ₹ 644 కోట్లు ఇచ్చాం. మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 16,408, కాకినాడ జిల్లాలో మరో 7,050 ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు మంచి చేస్తున్నాం అన్నారు.


👉మనం అధికారంలోకి రాకమునుపు ఇదేరకమైన పరిస్థితిని జీఎస్‌పీసీ వాళ్లు క్రియేట్‌ చేశారు. 2012కు సంబంధించి ₹.78 కోట్లు జీఎస్పీసీ ఇవ్వాల్సి ఉంది. 16,554 కుటుంబాలకు రావాల్సినంది రాని పరిస్థితి ఉంది. గతంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. మన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మత్స్యకారులకు మేలు మనమే రాష్ట్ర ప్రభుత్వం తరపున చేస్తూ ఆ ₹ 78 కోట్లను 16వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చాం. ఆ కుటుంబాల అవసరాలను మన అవసరాలగా భావించి వారికి తోడుగా ఉండే గొప్ప అడుగులు పడ్డాయి. ఆ తర్వాత జీఎస్పీసీని ఓఎన్‌జీసీ టేకోవర్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు దీనిగురించి ఓఎన్‌జీసీ దృష్టికి తీసుకొచ్చింది. రెండు, మూడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు వచ్చాయి. ఈలోగా మత్స్యకారులకు మంచి చేసే విషంయలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయలేదు. మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి కల్పిస్తూనే ఉన్నాం.


👉చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వారి సంక్షేమం కోసం తాపత్రయ పడి అడుగులు వేశాం. 1.07 లక్షల కుటుంబాలకు ఈ ఐదేళ్లలో వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసాగా అందించిన సహాయం ₹.538 కోట్లు అందించాం.


👉ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 మధ్యలో వేట నిషేధ సమయంలో వారికి సహాయాన్ని అందించాం. ఈ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో ఐదేళ్లకాలంలో మత్స్యకార సోదరులకు కేవలం ₹ 104 కోట్లు మాత్రమే ఇచ్చింది.


👉మనం ప్రతి ఒక్కరినీ ఈ పథకంలోకి తీసుకొస్తూ… పారదర్శకంగా అందిస్తూ వచ్చాం. గతంలో ₹ 4వేల నుంచి మనం ₹ 10వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం. ఇది కూడా దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడంలేదు.


👉గతంలో డీజిలుపై లీటరుమీద ₹.6లు సబ్సిడీ ఇస్తే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹.9 లకు పెంచాం. గతంలో ఆ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు. ఇప్పుడు డీజిలు పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా బంకులను ఎంపిక చేసి, ప్రతి మత్స్యకారుడికి ఒక గుర్తింపు కార్డు ఇచ్చి.. రిజిస్ట్రేషన్‌ ద్వారా దాన్ని నోట్‌ చేసుకుని డీజిల్‌ పోయించుకున్నప్పుడే ₹ 9 సబ్సిడీ తగ్గించి ఇచ్చే కార్యక్రమం చేశాం. ఇది కూడా గొప్ప విప్లవాత్మక మార్పు. డీజిలు సబ్సిడీని వర్తింపజేసే బోట్లను కూడా పెంచాం.


👉దాదాపు 20 వేల బోట్లకు ₹130 కోట్లుకు పైగా డీజిల్‌ సబ్సిడీ ఇచ్చాం. వేటకు వెళ్లే మత్స్యకారులు ఎవరైనా పొరపాటున మరణిస్తే.. ఎక్సŠగ్రేషియాను ₹ 10 లక్షలకు పెంచి ఇస్తున్నాం. అంతేకాకుండా ఘటన జరిగిన వెంటనే వారికి ₹ 5లక్షలు సాయం అందేటట్టుగా చేసి, ఆ తర్వాత మిగిలిన అమౌంట్‌ను 6 నెలల్లోగా అందజేసే కొత్త ఒరవడిని తీసుకొచ్చాం. దీనివలన దాదాపుగా 175 కుటుంబాలకు మంచి చేస్తూ దాదాపు మరో ₹ 17 కోట్లు అందించాం. గతంలో ఎక్స్‌గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు.


👉ఈ మూడు కార్యక్రమాలే కాక డ్రిల్లింగ్‌ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి ఇస్తున్నాం. జీఎస్పీతో మొట్టమొదట నష్టపోయిన ₹ 78 కోట్లు, ఆ తర్వాత ఓఎన్‌జీసీతో ఇప్పుడు మనం ఇప్పిస్తున్న ఐదు దఫాలకు సంబంధించిన ₹ 647 కోట్లుతో పాటు ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్‌ సబ్సిడీని అందిస్తున్నాం. దీనివలన 40850 మంది లబ్ధిదారులకు మంచి చేస్తూ.. దాదాపుగా ₹ 3500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం.


👉కేవలం ఈ ఆరు పథకాలకే ₹ 4913 కోట్లు అందించాం.ఇవికాకుండా నవరత్నాలు ద్వారా అదనంగా సాయం ప్రతి మత్స్యకార కుటుంబానికి సాయం అందిస్తున్నాం.


👉 వీటికి తోడు ప్రతి మత్స్యకారుడు తమ కాళ్లమీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్‌ హార్బర్‌ లేదా, ల్యాండింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. మనం వచ్చిన తర్వాతనే 10 పిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, 4 పోర్టులు వాయు వేగంతో నిర్మాణం చేస్తున్నాం. తీరవెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం. మనకున్న 974 తీరప్రాంతంలో బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకున్నాం. వీటన్నింటి వల్లా మత్స్యకారులు రాబోయే రోజుల్లో ఉపాధి కోసం ఎక్కడికెక్కడికో వెళ్లి ఉపాధి వెదుక్కోవాల్సిన అవసరం లేకుండా… మన రాష్ట్రంలోనే వాళ్లకు గొప్ప జీవితాలు ఉండేటట్టుగా అవకాశాలు మెరుగవుతాయి.


👉ఇవాళ జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రారంభించాలని అనుకున్నాం. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా నేరుగా అక్కడకు వెళ్లే ప్రారంభిస్తాను.
ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా మత్స్యకారులు ఏవిధంగా లబ్ధి పొందుతున్నారో తెలియాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఆ హార్బర్‌ను ప్రారంభిస్తాను. ఫిషింగ్‌ హార్భర్‌ వల్ల మత్స్యకారుల జీవితాలు మారుతాయి, ఒక్కో ఫిషింగ్‌ హార్భర్‌లో ఎన్ని బోట్లు ఉంటాయి, దీనివలన కోల్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్లతో సహా ఇతర మౌలిక సదుపాయాలు వలన ఏ రకమైన అభివృద్ది జరుగుతుందనేది ప్రజలకు తెలియాలి. అందుకే ఇవ్వాళ్టి కార్యక్రమాన్ని వాయిదా వేశాం.


👉మొత్తంగా 10 ఫిషింగ్‌ హార్భర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల నిర్మాణ పనులతో పాటు, 4 పోర్టుల నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. 4 పోర్టులను దాదాపు రూ.16వేల కోట్ల పెట్టుబడితోనూ, 10 ఫిషింగ్‌ హార్భర్లను రూ.4వేల కోట్లతోనూ, మరో రూ.200 కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు అంటే మొత్తంగా దాదాపు రూ.20వేల పై చిలుకు కోట్లతో సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల మీద పెట్టుబడి పెడుతున్నాం. ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. వీటివల్ల అత్యధికంగా మత్స్యకార కుటుంబాలు గణనీయంగా బాగుపడతాయి అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు