J.SURENDER KUMAR,
నియోజక వర్గంలో రైతాంగానికి ప్రస్తుత ఎండాకాలంలో పంటలు ఎండిపోకుండా D 74. D 83. D 84 కాలువల ద్వారా ధర్మారం, వెల్లటూర్, ప్రాంతాలకు సాగునీరు అందించాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు.
D -83 కాకతీయ మెయిన్ కాలువ ద్వారా 3,200 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నా కూడా ప్రస్తుతం 2,500 క్యూసెక్కులు మాత్రమే నీటి లభ్యత ఉందన్నారు.
పెగడపల్లి మండలములోని కొత్త చెరువు, మద్దులపల్లి గ్రామము మరియు పెద్ద చెరువు లింగాపూర్ గ్రామంలోని రెండు చెరువుల నీటి ద్వారా సుమారు 677 ఎకరాలు ఆయకట్టు సాగు నీరు మరియు త్రాగు నీరు లభ్యత ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త చెరువు,మద్దులపల్లి గ్రామము 30 Mfct & పెద్ద చెరువు లింగాపూర్ గ్రామము 80 Mcft మాత్రమే ఉందనీ, ధర్మపురి రైతాంగానికి తద్వారా ఎండాకాలం పంటలు ఎండిపోకుండ త్రాగు నీరు మరియు సాగు నీరు అందించి తమ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని, వినతిపత్రంలో పేర్కొన్నారు.
👉ముంపు బాధితులకు నిధులు విడుదల చేయండి !
వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారి పెండింగ్‌లో ఉన్న 126 నిర్మాణాలు రూ. 18 కోట్లు , 6 గ్రామాలకు ( చెగ్యాం, రాంనూర్, మొక్కట్రావుపేట, కోటిలింగాల, ఉండేడ మరియు తాళ్లకొత్తపేట ) వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద 250 మంది బాధితులకు ₹ 5 కోట్లు విడుదల చేయాలని కోరారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముప్పు గ్రామానికి సంబంధించి ₹ 2.06 కోట్ల రూపాయలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ PD ఖాతా నుండి జగిత్యాల జిల్లా కలెక్టర్ PD ఖాతాకు ₹.2.06 కోట్ల నిధులు బదిలీ చేయడానికి సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలిసి ఎమ్మెల్యే లక్ష్మి కుమార్ వినతి పత్రం ఇచ్చారు.