J.SURENDER KUMAR,
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆలయానికి చేరుకున్న టీటీడీ అధికారులకు శ్రీశైలం ఆలయ చైర్మన్ శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. పారుపత్తేదార్ తులసీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.