సుప్రీం కోర్టులోను ఎమ్మెల్సీ  కవితకు కష్టాలు తప్పవా ?


👉లిక్కర్ కుంభకోణంలో వంద కోట్ల ముడుపుల అంశంలో కవిత పాత్ర కీలకం !
👉ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ అధికారికంగా జారీ చేసిన ప్రకటనతో…

J.SURENDER KUMAR,


సుప్రీంకోర్టులోను ఎమ్మెల్సీ కవిత కు కష్టాలు తప్పవు అనే చర్చ న్యాయ వర్గాలలో జరుగుతుంది. లిక్కర్ కుంభకోణంలో వంద కోట్ల ముడుపుల అంశంలో కవిత పాత్ర కీలకం అని  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ అధికారికంగా సోమవారం జారీ చేసిన ప్రకటనతో మంగళవారం సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలో ఎమ్మెల్సీ కవిత కు నిరాశ తప్పదనే చర్చ.

ఢిల్లీలోని అవెన్యూ కోర్ట్  కవితను E D కస్టడీ కి వారం రోజులపాటు  విచారణకు అప్పగించిన విషయం తెలిసిందే . ఈనెల 23 వరకు E D అధికారులు కవితను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని E D ప్రధాన కార్యాలయం  జారీ చేసిన ప్రకటనతో ఆమెకు న్యాయపరమైన కష్టాలు తప్పవు అనే చర్చ.

👉ఎమ్మెల్సీ కవిత అంశంలో సోమవారం E D జారీ చేసిన పత్రికా ప్రకటన సారాంశం..


ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ED), ప్రధాన కార్యాలయం కార్యాలయం 15.03.2024న తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్, శ్రీమతి కె కవిత MLCని అరెస్టు చేసింది. గౌరవనీయమైన ప్రత్యేక PMLA కోర్ట్, న్యూఢిల్లీ ఆమెను 23.03.2024 వరకు 7 రోజుల పాటు ED కస్టోడియల్ ఇంటరాగేషన్ కోసం 16.03.2024 నాటి ఉత్తర్వు ప్రకారం రిమాండ్ చేసింది. 15.03.2024న హైదరాబాద్లోని శ్రీమతి కె కవిత నివాసంలో కూడా సోదాలు జరిగాయి. సోదాలు జరుగుతున్న సమయంలో ఈడీ అధికారులను శ్రీమతి కె కవిత బంధువులు, సన్నిహితులు అడ్డుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన మరియు అమలులో ఆదరణ పొందేందుకు శ్రీమతి కె కవితతో పాటు మరికొందరు ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిసి కుట్ర పన్నారని ED దర్యాప్తులో వెల్లడైంది. ఈ అనుమతులకు బదులుగా, ఆమె ఆప్ నేతలకు ₹ 100 కోట్లు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన మరియు అమలులో అవినీతి మరియు కుట్రల ద్వారా, టోకు వ్యాపారుల నుండి కిక్బ్యాక్ రూపంలో నిరంతర అక్రమ నిధులు AAPకి ఉత్పత్తి చేయబడ్డాయి. ఇంకా, శ్రీమతి కె కవిత మరియు ఆమె సహచరులు AAPకి ముందస్తుగా చెల్లించిన నేరాల ఆదాయాన్ని రికవరీ చేయవలసి ఉంది మరియు ఈ మొత్తం కుట్ర నుండి నేరం యొక్క లాభాలు/వసూళ్లను మరింతగా సంపాదించాలి. ఇప్పటి వరకు ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఆప్‌కి చెందిన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా 15 మందిని అరెస్టు చేశారు.ఈ కేసులో ED 1 ప్రాసిక్యూషన్ ఫిర్యాదు మరియు 5 అనుబంధ ఫిర్యాదులను దాఖలు చేసింది ఇంకా, క్రైమ్ ద్వారా వచ్చిన ఆదాయంలో, ₹128.79 కోట్లు ఇప్పటివరకు కనుగొనబడ్డాయి మరియు 24.01.2023 మరియు 03.07.2023 నాటి తాత్కాలిక అటాచ్‌మెంట్ ఆర్డర్‌ల ప్రకారం జతచేయబడ్డాయి. రెండు అటాచ్‌మెంట్ ఆర్డర్‌లను అడ్జుడికేటింగ్ అథారిటీ, న్యూఢిల్లీ ధృవీకరించింది. తదుపరి విచారణ ప్రక్రియలో ఉంది ప్రకటనలో పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత సుప్రీం గడప తొక్కనున్నారు. కవిత అరెస్ట్‌కు వ్యతిరేకంగా కవిత భర్త అనిల్‌ సుప్రీంకోర్టులో మంగళవారం  కంటెంప్ట్‌ పిటిషన్‌ వెయ్యనున్నారు. కవిత అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ ఈ పిటిషన్‌ వెయ్యనున్నారు. సుప్రీంకోర్టులో ఇప్పటికే కవిత కేసు ఒకటి  పెండింగ్‌లో ఉంది. అది కూడా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ గురించే. ఈ కేసులో తనను నేరుగా ఈడీ ప్రశ్నించకుండా ఉండేలా కవిత గతంలో పిటిషన్‌ వేశారు. ఇది  విచారణలో ఉండగానే ఈడీ కవితను అదుపులోకి తీసుకుంది. ఇదే అంశంపై  కవిత భర్త సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. కవిత తరుఫున ప్రముఖ లాయర్లు కపిల్ సిబల్‌, రోహత్గీ వాదించనున్నారు. 

👉 మద్యం పాలసీ ఏమిటి ?

నవంబర్  2021న ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని  అమలు చేసింది. ఈ పాలసీ కింద ఢిల్లీలో 32 జోన్లు ఏర్పాటు చేసి ఒక్కో జోన్‌లో గరిష్టంగా 27 దుకాణాలు తెరవాలి. ఈ విధంగా మొత్తం 849 దుకాణాలు తెరవాల్సి ఉంది. ఈ పాలసీ అమలకు ఢిల్లీలోని అన్ని మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేశారు. గతంలో ఢిల్లీలో 60 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ, 40 శాతం ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అది నూటికి నూరు శాతం ప్రైవేటుగా మారింది. దీనివల్ల ₹ 3,500 కోట్ల లాభం చేకూరుతుందని ప్రభుత్వం అప్పట్లో చెప్పుకొచ్చింది.

కవిత పాత్ర ?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె ఎమ్మెల్సీ కవితకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది. అందులో ‘సౌత్ గ్రూప్’  ఒకటి. ఈ గ్రూప్‌ని కంట్రోల్‌ చేసే వారిలో  కవిత ఒకరు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆప్‌ ప్రతినిధి విజయ్ నాయర్‌ కు కవితకు చెందిన సౌత్ గ్రూప్ ₹100 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.