👉ఈడి సీజ్ చేసిన 5 ఫోన్లు ఎవరివి ?
J.SURENDER KUMAR,
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణలో ఎమ్మెల్సీ వివాదం ఉండగా ఈడి ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసే సాహసం చేస్తుందా ? అనే చర్చ మొదలైంది. అయితే గతంలో అనేక సందర్భాల్లో పలు ఈడి సంబంధిత వివాదా అంశాలలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుల మేరకే ఈ డి అధికారులు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితురాలేనా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పక్క ఆధారాలతో పకడ్బందీ గా శుక్రవారం హైదరాబాద్ ఆమె ఇంటిలో అరెస్టు చేసి ఢిల్లీ కార్యాలయానికి తరలించారు అంటే కచ్చితంగా సుప్రీంకోర్టు గతంలో తమ కు ( ఈడి విషయంలో PMLA) ఇచ్చిన తీర్పుల మేరకే అరెస్టు జరిగి ఉండవచ్చని చర్చ.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) లోని సెక్షన్ 50 కింద ప్రాథమికంగా సమన్లు పొందిన వ్యక్తి మనీలాండరింగ్ విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) జారీ చేసిన సమన్‌లను గౌరవించి, ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 2024 ఇచ్చిన ఓ తీర్పులో పేర్కొంది.
తమిళనాడులోని ఐదు జిల్లాల కలెక్టర్లకు జారీ చేసిన ఈడీ సమన్ల అమలుపై మద్రాస్ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈడీ పిలిస్తే సమన్లు అందిన వ్యక్తి తప్పనిసరిగా హాజరుకావాలని, పీఎంఎల్‌ఏ కింద విచారణకు అనుగుణంగా అవసరమైతే సాక్ష్యాలను సమర్పించాలని జస్టిస్ బేలా ఎం త్రివేది , జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
చట్టం ప్రకారం విచారణ సమయంలో సాక్ష్యాలను సమర్పించడానికి లేదా హాజరు కావడానికి అవసరమైన ఏ వ్యక్తి నైనా ED పిలిపించవచ్చు .. . సమన్లు జారీ చేసిన వారు ఈడీ చెప్పిన సమన్లను గౌరవించి, వాటికి ప్రతిస్పందించాల్సి ఉంటుంది, ” అని పీఎంఎల్‌ఏ నిబంధనలను పరిశీలించిన తర్వాత కోర్టు పేర్కొంది. PMLAలోని సెక్షన్ 50 ప్రకారం, ED అధికారులు ఎవరైనా ఎవరి హాజరు అవసరమని భావించారో, సాక్ష్యం ఇవ్వాలన్నా లేదా చట్టం ప్రకారం ఏదైనా విచారణ సమయంలో లేదా ఏదైనా రికార్డులను సమర్పించాలన్నా, వారిని పిలిపించే అధికారం ఉంటుంది. పేర్కొంది.
👉మరో వివాదంలో సుప్రీంకోర్టు ...
పీఎంఎల్ఏ చట్టం కింద విచారణ చేపట్టేందుకు, అరెస్టు చేసేందుకు, ప్రాపర్టీని అటాచ్ చేసేందుకు ఈడీకి అన్ని అధికారాలు ఉన్నట్లు సుప్రీం మరో అంశం తీర్పులో పేర్కొంది. పీఎంఎల్ఏ కింద ఉన్న అన్ని ఈడీ అధికారాలను సుప్రీం సమర్థించింది. జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఈడీ, ఎస్ఎఫ్ఐవో, డైరక్టరేట్ ఆఫ్ రెవన్యూ ఇంటెలిజెన్స్ లాంటి దర్యాప్తు ఏజెన్సీలు పోలీసులు కాదు అని, అందుకే విచారణ సమయంలో వాళ్లు సేకరించిన ఆధారాలు వాస్తవమైనవే అని బెంచ్ పేర్కొన్నది. మనీల్యాండరింగ్ కేసులో అరెస్టు చేస్తున్న వ్యక్తికి ఎందుకు అరెస్టు చేస్తున్నారో ఈడీ అధికారులు చెప్పాల్సిన అవసరం లేదని కూడా కోర్టు పేర్కొన్నది. కాగా, విచారణ సమయంలో బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేస్తోందని కార్తీ చిదంబరం, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వంటి పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా ఆ వాదనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదిక- ఈసీఐఆర్‌ను నిందితులకు ఇవ్వాల్సిన అవసరం లేదన్న కోర్టు.. అది ఎఫ్ఐఆర్తో సమానమని స్పష్టం చేసింది. ఆరోపణలపై ఆధారాల కోసం నిందితుడిపై ఒత్తిడి చేయడం అంటే అతడి ప్రాథమిక హక్కు, జీవించే హక్కును హరించడమేనని పిటిషనర్లు వాదించగా దేశ సమగ్రత, సౌభ్రాతృత్వానికి సవాళ్లుగా మారిన ఆర్థిక నేరాలను కట్టడి చేయాలంటే ఇలాంటి ఒత్తిళ్లు తప్పవని కేంద్రం పేర్కొంది. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఈడీ అధికారాలను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.
మరో సందర్భంలో..
కవిత తనపై ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ లో నిబంధనల ప్రకారం ఒక మహిళను ఈడీ ముందు విచారణకు పిలవడానికి వీల్లేదని, ఆమె నివాసంలోనే విచారణ జరపాలని కోరారు.
కాగా విజయ్ మదన్లాల్ చౌదరి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పీఎంఎల్ఏ కేసుల్లో సెక్షన్ 160 సీఆర్పీసీ వర్తించదని ఈడీ తెలిపింది.
దిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసులో గత ఏడాది ప్రశ్నించింది. 2023 మార్చి లో మూడు రోజుల పాటు సుమారు 27 గంటల పాటు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ సమన్లపై గత ఏడాది సుప్రీంకోర్టును ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం మహిళలను వారి ఇంటి వద్దే విచారించాలని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కవిత సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను అంతకుముందు దాఖలైన నళినీ చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ కేసులకు సర్వోన్నత న్యాయస్థానం జతచేసింది.
👉ఐదు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకున్న!

ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐదు సెల్ ఫోన్ లను స్వాధీన పరుచుకున్నామని, ఈడి పంచ నామాలో పేర్కొన్నారు. అయితే ఆ ఫోన్లు ఎవరివి ? ఎందుకోసం స్వాధీన పరుచుకున్నారు అనే విషయం పంచ నామాలో నమోదు చేయలేదు. ఎమ్మెల్సీ కవిత ఇంటిలో ఆమె సమక్షంలోనే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆమె సమ్మతితోనే శుక్రవారం పగలు 1 గంట 45 నిమిషాలకు అధికారులు తనిఖీ చేపట్టామని. సాయంత్రం 6.45 నిమిషాల వరకు తనిఖీలు పూర్తి చేసినట్టు పంచనామాలో పేర్కొన్నారు.
సాక్షులుగా.శ్రీనివాస రెడ్డి చీఫ్ మేనేజర్,
జోనల్ ఆఫీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా,హైదరాబాద్,
Y. వివేకానంద కుమార్ రెడ్డి సీనియర్ మేనేజర్,
జోనల్ ఆఫీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా,హైదరాబాద్, సాక్షులుగా పంచనామ పత్రంలో పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టు అంశంలో ఈ డి అధికారులు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను జతపరచి సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ వేసి మరింత సమాచార సేకరణ కోసం కవితను అదుపులోకి ఇవ్వాలని ఈ డి అధికారులు పిటిషన్ వేయనున్నట్టు చర్చ.