J.SURENDER KUMAR,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ క్రీ.శే దుద్దిల్ల శ్రీ పాద రావు జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని అసెంబ్లీ లో వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు. అర్పించారు. ఉభయ సభలో స్పీకర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
👉జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో…

ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి శ్రీపాదరావు అని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. స్వర్గీయ శ్రీపాద రావు 87 వ జన్మదిన వేడుకను IDOC సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించారు.
👉 ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో..

శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి నీ ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. చైర్ పర్సన్ శ్రీమతి సంగి సత్తమ్మ కమీషనర్ M శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.
👉కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...

ధర్మపురి పట్టణం లోని నంది చౌక్ వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి స్వర్గీయ శ్రీపాద రావు జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంగనభట్ల దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, చిలుముల లక్ష్మణ్, సీపతి సత్యనారాయణ, జక్కు పద్మ రవిందర్, వొజ్జల లక్ష్మణ్, అప్పం తిరుపతి, రఫీయొద్దిన్, గరిగే రమేష్,గాజు సాగర్, ఎండీ షబ్బీర్,.స్తంభంకాడి గణేష్, నరేందర్, బొల్లారపు పోషన్న,గుడ్ల రవీందర్, రమణ, సత్తన్న, శరత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
.