తిరుమలలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం!


J. SURENDER KUMAR,

తిరుమలలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి స్వామి పుష్కరిణి జలాల్లో చక్కగా అలంకరించి మూడు ప్రదక్షిణలు చేయడంతో వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

బుధవారం జరిగే తెప్పోత్సవం సందర్భంగా సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
ఈ సందర్భంగా రామచద్రుదితుడు రఘువీరుడు తదితర శ్రీరామ సంకీర్తనలను గాత్ర, వాయిద్య కళాకారులు అందించరు. వేద పారాయణ దారులు లయబద్ధంగా వేద స్తోత్రాలు పఠించారు.

టీటీడీ ఈవో  ఏవీ ధర్మారెడ్డి, సీఈ నాగేశ్వరరావు, వీజీవోలు  నందకిషోర్,  గిరిధరరావు,  బాలిరెడ్డి, ఆలయ డీఈవో  లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.