J.SURENDER KUMAR,
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలలో దర్శనం, ఆర్జిత సేవా టిక్కెట్లు, శ్రీవారి సేవా కోటా వివరాలను ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నారు.
👉మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల నమోదు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించి టిక్కెట్లను ఖరారు చేసుకోవాలి.
👉మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవాల కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టిక్కెట్లను విడుదల చేస్తారు.
👉జూన్ 19 నుంచి 21 వరకు జరిగే జ్యేష్ఠాభిషేకంలో పాల్గొనేందుకు మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంచుతారు.
👉మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకర సేవా టిక్కెట్లు, దర్శన టిక్కెట్ల వర్చువల్ సేవల కోటా విడుదల చేయబడుతుంది.
👉 అంగప్రదక్షిణం టోకెన్లు మార్చి 23 ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి.
👉శ్రీవాణి ట్రస్ట్ దర్శనం మరియు గదుల కోటా మార్చి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయబడుతుంది.
👉 మార్చి 25న ఉదయం 10 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
👉తిరుమల మరియు తిరుపతిలో రూమ్ కోటా మార్చి 25 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయబడుతుంది.
👉తిరుమల, తిరుపతి కోటాలో శ్రీవారి సేవా స్వచ్ఛంద సేవ మార్చి 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవను అదే రోజు మధ్యాహ్నం 1 గంటలకు విడుదల చేస్తారు.
పైలైన్ కోటాను TTD అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాలని అభ్యర్థించారు.