👉 డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో..
J.SURENDER KUMAR,
ఎస్సీ వర్గీకరణ అంశంలో ప్రభుత్వ పక్షాన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ లో గురువారం జరిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
వర్గీకరణ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వపరంగా సహాయ సహకారాలతో పాటు, దేశంలో అత్యున్నత సుప్రీం కోర్ట్ లో ఈ అంశంపై వాదించడానికి ప్రముఖ న్యాయవాదులను నియమించడం అభినందనీయమన్నారు. అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించితే, అట్టి రాజ్యాంగాన్ని అమలు చేయడంలో స్వర్గీయ బాబు జగ్జివన్ రామ్ ముఖ్య భూమికను పోషించారని లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉అసైన్డ్ కమిటీలను పునరుద్ధరించండి!

గత కెసిఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన నియోజకవర్గ అసైన్మెంట్ కమిటీలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సీఎంకు లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అసైన్డ్ కమిటీ ద్వారా గ్రామాలలో బడుగు, బలహీన, నిరుపేద ప్రజలకు ప్రభుత్వ, మిగులు భూములను పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. బడుగు, బలహీన, దళిత వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని అన్నారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు..