ఎన్నికల కోడ్ పాటించిన కలెక్టర్ షేక్ యాసిన్ భాష


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ధర్మపురి క్షేత్రంలో గురువారం తాను ఎన్నికల ప్రోటోకాల్ కోడ్ పాటించి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నది.
వివరాలు ఇలా ఉన్నాయి

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తుంటారు. ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, ఆలయ పాలకవర్గం, లేదా ? ఉత్సవ, అభివృద్ధి కమిటీ సభ్యులు , ఆలయ ఉద్యోగులు కలెక్టర్ వెంట ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

2023 మార్చ్ 4 (ఫైల్ ఫోటో)


ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కోడ్ ముగిసే వరకు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల పర్యటనలలో పాల్గొనవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
గత సంవత్సరం డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధుల వెంట ఉన్న ఒక్కరు ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పక్షాన స్వామివారికి సమర్పించిన తలంబ్రాలు, పట్టు వస్త్రాల కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డిఓ, స్థానిక తాసిల్దార్, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఉద్యోగులు, అర్చకులు మాత్రమే పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలల్లో రాష్ట్రంలో పలువురు కలెక్టర్లను బదిలీ చేసింది. జగిత్యాల కలెక్టర్ ను ప్రభుత్వం బదిలీ చేయకపోవడం విధుల నిర్వహణ పట్ల ఆమె పనితీరు కు నిదర్శనం ఉద్యోగ సంఘాలు నాయకులు చర్చించుకుంటున్నారు.