అక్రమంగా డబ్బు మద్యం రానీయకుండా చెక్ పోస్టుల ఏర్పాటు!

👉 అదనపు ఎస్పీ వినోద్ కుమార్ !

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గండి హన్మడ్లు, ఓబులపుర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను అదనపు ఎస్పీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్ పోస్టులు కీలకపాత్ర వ్యవహరిస్తాయని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా బోర్డర్ చెక్ పోస్టులను, పకడ్బందీగా 24×7 వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని, జిల్లా లోనికి అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజలను ప్రలోభ పెట్టే వస్తువులను జిల్లాకు రాకుండా వివిధ శాఖల సమన్వయంతో 24 గంటల పర్యవేక్షణలో చెక్ పోస్టు ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


అనంతరం వాహన తనిఖీలు చేసిన వాహన నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించండంతో పాటు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు.