ఆలోచన అద్భుతం – అరుపులకు ఆమడ దూరం – ధర్మపురి ఆలయంలో!

J.SURENDER KUMAR,


ఆ ఆలోచన ఎవరిదో తెలియదు గాని, ఆ ఆలయంలో భక్తజనం నిర్భయంగా రావి చెట్టు, ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పూజలు చేసుకుంటు, స్వామివారికి కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. కొబ్బరి ముక్కలు చేతిలో పట్టుకొని వారు పరిసరాలలో. ఉన్న మరో ఆలయానికి నిర్భయంగా దర్శనానికి పోతున్నారు. అక్కడివారు ఈ ఆలయానికి దర్శనానికి వస్తున్నారు. కృత్రిమంగా, సాంకేతిక ఆలోచనతో ఏర్పాటు చేసిన అరుపుల శబ్దాలతో ఏర్పాటుచేసిన పరికరం తో కొన్ని జంతువులు ఆమడ దూరం పారిపోతున్నాయి.

వివరాలు ఇలా ఉన్నాయి.

చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా. మంగళవారం ధర్మపురి క్షేత్రంలో మాలాధారణ స్వాముల, భక్తుల రద్దీ పెరిగింది. నిత్యం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కోతులు సైర్య విహారం చేస్తుంటాయి. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణాలు, పూజలు చేసుకోవాలన్న కోతుల బెడదతో భక్తులు భయం భయంగా చేసుకోవాల్సిన దుస్థితి. దీనికి తోడు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రఖ్యాతిగాంచిన ఈశాన్య గణపతి ఆలయం ఉంది. దానికీ ఆనుకొని వందలాది సంవత్సరాల చరిత్ర గల రావిచెట్టు, పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం నెలకొని ఉంది. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ఈశాన్య గణపతి దర్శనంతో పాటు రావి చెట్టు ప్రదక్షిణలో హనుమంతుని విగ్రహానికి పూజలు నిర్వహిస్తుంటారు. చెట్టు పైనే భారీ సంఖ్యలో కోతుల ఆవాసం, వాటి విన్యాసాలు భక్తుల చేతిలో ఉన్న ప్రసాదాలు లాక్కోవడం, కొన్ని సందర్భాల్లో భక్తులను గాయపరచడం షరా మామూలే.

గణపతి ఆలయంలో రావి చెట్టు దగ్గర పదుల సంఖ్యలో కోతులు కూర్చోవడంతో భక్తులు భయంతో వెనుదిరిగి రామాలింగేశ్వర స్వామి దర్శించుకుని వెళ్తుంటారు.


చిన్నా హనుమాన్ జయంతి పర్వదినం నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తజనం కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. ఆలయ ఉద్యోగులో, అర్చకులో, తెలియదు కానీ. బ్యాటరీ మైక్ లో కుక్కల అరుపుల శబ్దం వచ్చేలా చిప్ ఏర్పాటుచేసి, రావి చెట్టు దగ్గర పెట్టి మైక్ స్టార్ట్ చేశారు.

ఆ మైక్ నుంచి. నిరంతరము కుక్కల ( జర్మన్ షెఫర్డ్ ) అరుపుల శబ్దంలతో కోతులు ఆలయ ప్రాంగణంలో గానీ, పరిసరాల్లో గాని ,కంటికి కనిపించడం లేదు. దీంతో భక్తజనం నిర్భయంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పూజలు చేసుకుంటున్నారు. ఈ అరుపులు ఆలోచన ఎవరిదో కానీ పలువురు భక్తులు మాత్రం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.