అయోధ్యలో భక్తుల రద్దీ నియంత్రణ కు టీటీడీ సలహాలు సూచనలు!

J.SURENDER KUMAR,


అయోధ్య శ్రీ రామ మందిరంలో భక్తుల రద్దీ నియంత్రణ,

త్వరితగతిన దర్శనం కోసం అయోధ్య ఆలయ ట్రస్టు విజ్ఞప్తి

మేరకు టీటీడీ వారికి సలహాలు సూచనలు ఇచ్చింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఓ  ఎవి ధర్మారెడ్డి నేతృత్వంలోని ఇంజినీరింగ్ అధికారుల బృందం అయోధ్యను సందర్శించి, రద్దీ నిర్వహణపై వారికి సాంకేతిక సలహాలు సూచనలు వివరించారు. అందించింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అభ్యర్థన మేరకు  ఫిబ్రవరి 16, 17 న తిరుమల తరహాలో భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు ట్రస్టు అవసరాలను అంచనా వేయడానికి టిటిడి అధికారుల బృందం గతంలో పర్యటించిన విషయం విధితమే.
శనివారం సాయంత్రం టీటీడీ ఈవో, ట్రస్టు నిర్వాహకుల మధ్య సమావేశం జరిగింది.

క్రౌడ్ మేనేజ్‌మెంట్, క్యూ లైన్లు, వాటర్ పాయింట్లు, ఎంటర్ మరియు ఎగ్జిట్ మార్గాలు మొదలైన వాటిపై సాంకేతిక సలహాలతో కూడిన సమగ్ర నివేదిక ట్రస్ట్‌కు టిటిడి అధికారులు అందించారు.  అనంతరం టీటీడీ బృందం అయోధ్య మందిరంలో శ్రీరాముని దర్శనం చేసుకుంది.

టీటీడీ నుంచి సాంకేతిక సలహాదారు శ్రీరామచంద్రారెడ్డి, ఎస్ ఈ2  జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈ ఈ లు రామకృష్ణ, నాగరాజు, రామమందిరం ట్రస్టు తరపున  చంపత్‌రాయ్‌, గోపాల్‌జీ,  అనిల్‌ మిశ్రా,  దినేష్‌, సుఖాల తదితరులు పాల్గొన్నారు.