J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా బీర్ పూర్ గుట్టలలో వెలసిన
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు. చెందిన లక్షలాది
రూపాయల నిధులను ఆలయ అధికారులు తప్పుడు
ఓచర్లతో గోల్మాల్ చేశారు. అట్టి లక్షలాది రూపాయలను
సంబంధిత కార్యనిర్వహణాధికారి నుంచి దేవాదాయ శాఖ
ఉన్నతాధికారులు రికవరీ చేశారో ? చేస్తారో లేదో ? అనే
అంశంలో స్పష్టత లేదు.
👉వివరాల్లోకి వెళితే..
బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం శతాబ్దాల చరిత్ర గల అతి పురాతనమైన ప్రముఖ ఆలయం. స్వామివారీ ఆలయం ఎత్తైన గుట్టలలో, దట్టమైన అడవుల మధ్య ఉంది. ప్రతి సంవత్సరం స్వామి వారి జాతర ఉత్సవాలు కొన్ని రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బీర్పూర్ , సారంగాపూర్, రాయికల్, ఆదిలాబాద్ జిల్లా, ఖానాపూర్, జన్నారం, ఇంద్రవెల్లి ప్రాంతాల నుంచి లక్షలాదిగా గ్రామీణులు జాతరకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయ పరిసరాలు పర్యాటక ప్రాంతంగా వీరాజీలుతున్నది.

స్వామి వారి జాతర ఉత్సవాలలో, కొండపై దేవాదాయ శాఖ పక్షాన, కొబ్బరికాయల తదితర దుకాణాలకు వేలం నిర్వహిస్తారు. కొండ కింద జాతరలో రథాలు తిరిగే ప్రాంతంలో గ్రామ పెద్దలు కొన్ని దుకాణాలకు వేల నిర్వహించి అట్టి డబ్బులు ఆలయ అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి వినియోగిస్తుంటారు.
👉రాజకీయాలు వేరైనా కలిసికట్టుగా !
చైతన్యవంతమైన బీర్పూర్ గ్రామంలో ప్రతి ఒక్కరిలో అన్యాయాలు, అక్రమాలను నిలదీసి, ప్రశ్నించే తత్వం కలిగి ఉంటారు. రాజకీయాలు, పార్టీలు వేరైనా ఆలయ అభివృద్ధి, గ్రామాభివృద్ధి అంశములో కలిసికట్టుగా ఒకటి ఉండడం బీర్పూర్ గ్రామ ప్రత్యేకత. ప్రస్తుతం బీర్పూర్ మండల కేంద్రంగా కొనసాగుతున్నది.
👉సిసి రోడ్డు విద్యుత్తు సౌకర్యం!
ఏ పార్టీ అధికారంలో ఉన్న, పార్టీలకతీతంగా గ్రామస్తులు కలిసికట్టుగా ఎత్తైన కొండలు దట్టమైన అడవిలో ఉన్న ఆలయానికి దాదాపు రెండు కిలోమీటర్ల సిసి రోడ్డును, విద్యుత్, సరఫరా తాగునీటి సౌకర్యాల కల్పన కోసం గ్రామ ప్రజలు కృషి చేసి విజయం సాధించారు.
👉 అవినీతి కి చెక్ ?
దాదాపు కొంత కాలం క్రితం బీర్పూర్ స్వామివారికి భక్తులు సమర్పించుకున్న బియ్యం (మొక్కులు) దాదాపు 40 క్వింటల్లు కు పైగా నిల్వ ఉన్న బియ్యాన్ని దేవస్థాన పక్షాన గుట్టు చప్పుడు కాకుండా వేలం నిర్వహించారు. దాదాపు దాదాపు 30 క్వింటాళ్ల బియ్యం వేలం వేసినట్టు ప్రకటించారు. గ్రామస్తులు మాత్రం 30 కింటాళ్ళకు పైగా బియ్యం నిల్వలు ఉండి ఉంటాయని. అధికారులు నిలదీసి ప్రశ్నించారు.
వేలంలో బియ్యం కొనుగోలు చేసిన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన కాంట్రాక్టర్ ను బీర్పూర్ కు రప్పించి పంచాయతీ నిర్వహించినట్లు చర్చ. బియ్యం కొనుగోలు చేసిన కాంట్రాక్టర్ అదనంగా మరికొన్ని క్వింటాళ్ల బియ్యానికి డబ్బులు ఆలయానికి చెల్లించినట్లు సమాచారం.
👉లక్షలాది రూపాయల గోల్మాల్ లో మచ్చుకు కొన్ని!
ఇంచార్జ్ ఎగ్జిక్యూటివ్ అధికారి పాలనలో కొనసాగుతున్న బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిధులను ఇష్టానుసారంగా బిల్లులు పెట్టి గోల్మాల్ చేసినట్టు అధికారులు గుర్తించారు.
👉ఒకే రోజున కొనుగోలు చేసిన బట్టలకు రెండు ఓచర్ల అవసరం ఏమిటి ?
👉 23-02-2923 న, ఓచర్ నంబర్ 89, బట్టల షాప్ యజమానికి చెల్లించిన మొత్తం ₹, 15,985/- రూపాయలు.
👉 23-02-2023 న,ఓచర్ నెంబర్ 87, బట్టల షాప్ యజమానికి చెల్లించిన మొత్తం ₹ 41,000/- రూపాయలు.
👉 ఓచర్ పెట్టారు సంతకం మరిచారు !
👉 30-08-2022 న,ఓచర్ నెంబర్ 29, కిరాణం కొనుగోలుకు చెల్లించిన మొత్తం ₹ 12,570/- సంతకం లేని ఓచర్ ను ఆలయ అకౌంట్ బుక్ లో జతపరిచారు.
👉 10-05-2022 న,చేల్లని ఓచర్ పెట్టారు ( ఇన్వాల్యుడ్) ఓచర్ నెంబర్ 11, బట్టల కొనుగోలుకు ₹, 20,000/- చెల్లింపులు.
👉 28-01-2023 న ఓచర్ నంబర్ 77, ఫ్లెక్సీలో కోసం ₹ 26,400/- చెల్లింపులు
👉 09-03-2023 న ఓచర్ నెంబర్ 96, వీడియో, ఫోటోగ్రాఫర్ కు ₹, 25,000/- చెల్లింపులు
👉 23-02-2023 న , ఓచర్ నెంబర్ 85, టెంట్ సామాగ్రి, పందిళ్లకు ₹, 50,000/- చెల్లింపులు.
( పైన పేర్కొన్న ఓచర్లు కొన్ని మాత్రమే )
లక్షలాది రూపాయల ఖర్చులు, సరుకులు కొనుగోలు కోసం చెల్లించినట్టు రికార్డు బుక్ లలో నమోదు చేసిన వివరాలకు ముందస్తు అధికారుల అనుమతి ఎందుకు తీసుకోలేదని ?
కొనుగోలు చేసిన వాటి కొటేషన్లు, క్వాలిటీ క్వాలిటీ వివరాలు ఎందుకు నమోదు చేయలేదని ? ఉన్నతాధికారులు బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్మాణాధికారికి నోటీసు జారీ చేశారు.

లక్షలాది రూపాయలు నిధుల అవకతవకల అంశంలో గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎలా స్పందిస్తా రో ? వేచి చూడాల్సిందే.