భక్తుల సౌకర్యార్థం ప్రముఖ ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు !

👉దేవాదాయ కమీషనర్ హనుమంతరావు !


J.SURENDER KUMAR,


తెలంగాణలో ప్రముఖ ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవలు అతి త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు దేవాదాయ, సమాచార పౌర సంబంధాల కమీషనర్ హనుమంతరావు అన్నారు.


మంగళవారం రోజున ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ కమిషనర్ హనుమంతరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.
ఆలయాల్లో స్వామివారికి అందించే సేవలు, వసతులు, ప్రత్యేక పూజాది కార్యక్రమాల వివరాలు భక్తుల సౌకర్యార్థం త్వరలో ఆన్ లైన్ లో అందుబాటులో కి రానున్నదని కమిషనర్ హనుమంతరావు వివరించారు.

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధి చేందిదనీ కమీషనర్ అన్నారు.
గోదావరి నదీ పరివాహక ప్రాంతం లోని ధర్మపురి పుణ్యక్షేత్రం దర్శనానికి భక్తులు రావడం జరుగుతుందని తెలిపారు. దేవాలయంలో రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

అంతకు ముందు ఆలయ అర్చకులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికి, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు.


ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ కృష్ణ చైతన్య, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపప్రదాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, మరియు సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు.


ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పలు సమస్యలపై కమిషనర్ కు అర్జీలు అందించారు.