👉దాడిని ఖండించిన ప్రధాని మోడీ !
👉 అమరావతి ప్రాంత సమీపంలో దాడి ?
J.SURENDER KUMAR,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై శనివారం రాత్రి
విజయవాడలో జరిగిన దాడి ఎన్నికలలో ఆయన దూకుడు
కట్టడి కోసమా ? లేదా ఆయనను హతమార్చడం కోసం దాడి
జరిగిందా ? ముందస్తుగా జగన్ పై దాడికి అగంతకులు రిక్కీ
నిర్వహించారా ? అనే కోణంలో పోలీసు యంత్రాంగం
తర్జనభర్జన పడుతున్నారు.
“మేమంతా సిద్ధం” రోడ్ షో బస్సు యాత్ర 14వ రోజులో
భాగంగా నంబూరు క్రాస్ రోడ్స్ నుంచి విజయవాడ లోని సింగ్
నగర్ ప్రాంతానికి చేరుకున్న తరుణంలో ఈ దాడి ఘటన
జరగడం ఒక హఠాత్పరిణామం. అమరావతి రాజధాని
ప్రాంతాల ప్రజలు సిఎం కు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో
ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తుంది.
దాడి జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోడీ జగన్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు ట్విట్ చేయడంతో. నిఘా వర్గాలు దాడి జరిగిన తీరును ప్రధానికి వివరించినట్టు సమాచారం. అనంతరం పలువురు జగన్ పై జరిగిన దాడిని ఖండించారు.
సీఎం జగన్ ఎడమ కంటి పై భాగం నుదురుకు తగిలిన గాయం రాయితో నా ? ఇనుప వస్తువు వా ? అనేది దాడి జరిగి 12 గంటలైనా పోలీస్ వర్గాలు నిర్ధారించలేకపోతున్నారు.

ఎయిర్ గన్ ? లేదా గులేర్ ? తో జగన్ ను టార్గెట్ చేశారా ? అనే విషయం పోలీస్ యంత్రాంగం నిర్ధారించలేకపోతున్నది. రోడ్డు పై కింద నిల్చున్న జనం నుంచి అగంతకులు బస్సు పైకి రాయి విసిరినా అంతా వేగంగా వెళ్లే అవకాశం లేదనేది జగమెరిగిన సత్యం. ఒకవేళ అగంతకులు జగన్ పై కోపం ఉండి ఉంటే జగన్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా నినాదాలు చేసేవారు. బస్సు పై నిలుచుండి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ ను అంతకంటే ఎత్తైన ప్రదేశం నుంచి రాయి లేదా ? ఎయిర్ గన్, గులేర్ తో దాడికి పాల్పడే తేనే టార్గెట్ కు రక్త గాయం అయ్యే అవకాశం ఉంటుందనేది చర్చ.
దీనికి తోడు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి, శనివారం వరకు ఆయన భార్య భారతి రెడ్డి ప్రజాక్షేత్రంలోకి రాలేదు. శనివారం తాడేపల్లి జంక్షన్ వద్ద జనంలో నిల్చుండి, తన భర్త జగన్ బస్సు యాత్ర కు ఆమె చేతులు ఊపి ఆమె అభినందించారు.
ఇదే రోజున వైయస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి సోదరి విమలమ్మ, మీడియా సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి , అవినాష్ రెడ్డి లపై ఇద్దరు చెల్లెలు షర్మిల, సునీతమ్మలు ఆరోపణలు చేయడం తగదని. నేను ఆ ఇంటి ఆడపడుచును. ఆరోపణలు చేయకుండా షర్మిలా, సునీత లు నోరు మూసుకోవాలని విమలమ్మ హెచ్చరించిన విషయం విధితమే.
దీనికి తోడు మంగళగిరిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి, చేనేత వర్గాలతో ముఖాముఖి సమావేశం. ఈ సమావేశంలో కుప్పం, మంగళగిరి, బీసీల ఎమ్మెల్యే సీట్లను తండ్రి, కొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేష్. పోటీ చేస్తూ వారు బీసీ జపం చేయడం ఏమిటో ? . అని సీఎం జగన్ ఆ సమావేశంలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనికి తోడు విజయవాడ పార్లమెంట్ సిట్టింగ్ టిడిపి ఎంపీ కేశినేని నాని, వైఎస్ఆర్సిపి లో చేరడం, ఆ పార్టీ అభ్యర్థిగానే తిరిగి ఇదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రచారంలో దూకుడును కట్టడి చేయడం కోసమా ? లేక భౌతికంగా హతమార్చడం కోసమా ? దాడి చేశారా అనే అంశం నిర్ధారణ కాలేదు, అయితే ఈ దాడికి పాల్పడిన అగంతకులు పక్కాగా ప్రొఫెషనల్ దాడికి పాల్పడి ఉండి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలకు మేమంతా సిద్ధం రోడ్ షో బస్సుపై సీఎం జగన్ తో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి,. ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, వారి చుట్టూ ఉన్న అంగరక్షకులకు ఉన్నారు. ఎవరికి తగలకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి దాడికి పాల్పడింది ప్రొఫెషనల్ షూటర్స్ అనే వాదనకు బలంగా నమ్మవచ్చు.
జగన్ నుదుటికి తగిలిన వస్తు ఎమ్మెల్యే అభ్యర్థి వేల్లంపల్లికి తగిలిందా ? లేక రెండు రాళ్ల ను అగంతకులు వాడారా ? ఎయిర్ గన్ లేదా, గులేర్ ను అగంతకులు ఉపయోగించి ఉండవచ్చునే చర్చ పోలీస్ వర్గాల్లో నెలకొంది. ఇలా ముందస్తు రిక్కి నిర్వహించి జగన్ రోడ్ షో బస్సు యాత్ర తాము నిర్దేశించుకున్న కిల్లింగ్ జోన్ లోకి రాగానే లక్ష్యం పూర్తి చేయాలని అగంతకులు పక్క స్కెచ్ కు రంగం సిద్ధం చేసుకొని ముందస్తు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చు అనేది చర్చ.
ఈ కేసు విచారణలో పోలీస్ యంత్రాంగం పై ఏలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, ఎన్నికల సంఘ పర్యవేక్షణలోనే పోలీస్ యంత్రాంగం విచారణ చేపడుతున్న నేపథ్యంలో అగంతకులు పట్టుబడి వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు చర్చ.