J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ ఎండపెల్లి మండలం రాజారం పల్లె లో మే మాసం 3 న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

సోమవారం సీఎం పాల్గొన్న రాజారాం పల్లి సభ వేదిక ను సభ స్థలాన్ని, ఏర్పాట్లను, ఎమ్మెల్యే అధికారులతో, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. వాహనాల పార్కింగ్, తాగునీటి సౌకర్యం, ట్రాఫిక్ డైవర్షన్, హెలిప్యాడ్, తదితర ప్రధాన అంశాల పై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.
👉సుద్దపెల్లి గ్రామంలో…

పెగడపల్లి మండలం సుద్దపెల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డ్ సభ్యులు కొల తిరుపతి కుమార్తె రీషిత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించగా రిషితన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
👉కప్పారావుపేట్ గ్రామంలో..

వెల్గటూర్ మండలం కప్పారావు పేట గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంల్లో ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలిసి. పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశిని భారీ మెజారిటీతో గెలిపించాలని,

.
ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఉపాది హామీ కూలీని ₹ 200 నుండి ₹ 400 వందలకు పెంచుతామని, ఎమ్మెల్యే వారికి వివరించారు.
👉జైన గ్రామంలో…

ధర్మపురి మండలం జైన గ్రామంలో జరుగుతున్న శ్రీ రామలింగేశ్వర మార్కండేయ స్వామి జాతర ఉత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
👉దొంతపూర్ గ్రామంలో..

ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ కుమారుడు కార్తీక్ సుమలతల వివాహం ఇటీవల జరిగింది. లక్ష్మణ్ నివాసానికి వెళ్లి నూతన వధూవరులకు ఆశీర్వదించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.