దళితుల ఉన్నతికి పోరాడిన మహనీయుడు  అంబేద్కర్ !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J. SURENDER KUMAR,

దళితుల అభ్యున్నతి కోసం అనునిత్యం పోరాడిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, అని  ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా  సంఘ సంస్కర్తగా, దళితుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా ఆదివారం  ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో ప ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే   మాట్లాడుతూ..
భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి  అంబేద్కర్  స్ఫూర్తితోనే రాష్ర్ట ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అన్నారు.  ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపించిన బాటలో నడవాలని, ధర్మపురి లో అంబేద్కర్ సంఘ భవన్నాన్ని, మరియు స్టడీ సర్కిల్ నీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరించారు.


ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, దళిత సంఘాల సీనియర్ నాయకులు పారిపెల్లి రాజమల్లయ్య, ధర్మపురి చైర్పర్సన్ సంఘీ సత్యమ్మ,  ఎంపీపీ చిట్టిబాబు, జడ్పిటిసి బత్తిని అరుణ, బుగ్గారం జడ్పిటిసి బాదినేని రాజేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనమట్ల దినేష్, మున్సిపల్ ప్లోర్ లీడర్ వేముల నాగలక్ష్మి,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాందెని మొగిలి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుంట సుధాకర్, జక్కు రవి, వోజ్జల లక్ష్మణ్, ఆశెట్టి శ్రీనివాస్, సుముక్, పోచయ్య, పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

👉జగిత్యాలలో..

అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో నిర్వహించిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

👉ధర్మారం మండల కేంద్రంలో..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శనివారం రోజున ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.