ధర్మపురి ఆలయ అవినీతి పై విచారణ జరగదు చర్యలు ఉండవు !

👉ఫిర్యాదు చేసి ఐదు సంవత్సరాలైనా విచారణ జరగదు.

👉అమ్మవారి గాజుల అదృశ్యం తోపాటు అవినీతిపై ఫిర్యాదులో అంశాలు !

👉గత ప్రభుత్వ నాయకులే విచారణను అడ్డుకుంటున్నారు !

👉లక్ష్మి నర్సింహుడికి దిక్కు ఎవరు ?

J.SURENDER KUMAR,


భక్తజనం పాలిట కొంగు బంగారంగా కష్టాలు నష్టాలు,

కడతేర్చి, భక్తులకు ఆపద్బాంధవుడి గా వెలుగొందుతున్న

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న

అవినీతి అక్రమాలపై గత ప్రభుత్వ యంత్రాంగం విచారణ

చేయడానికి సాహసం చేయలేకపోయారు. అవినీతి

అక్రమాలను కళ్ళకు కట్టినట్టుగా సాక్షాలతో ప్రముఖ వ్యక్తులు

నాటి దేవాదాయ శాఖ కమిషనర్ ను నేరుగా కలిసి ఫిర్యాదు

చేసి ఐదు సంవత్సరాలు అవుతున్న చర్యలు శూన్యం. ఆ

ఫిర్యాదు పై విచారణ నేటికీ ప్రారంభం కాలేదు.

ఓ భక్తురాలు అమ్మవారికి ఇచ్చిన లక్షలాది రూపాయల విలువ గల బంగారు గాజుల అదృశ్యం, ఆలయంలో నెలకొన్న అక్రమాలు, లక్షలాది రూపాయల అవినీతి పై స్వర్గీయ బిజెపి మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ వి సుధాకర్ శర్మ, స్థానిక బిజెపి నాయకుడు నాటి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కస్తూరి మురళి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాటి బిజెపి నాయకుడు నందగిరి గిరిధర్, కలిసికట్టుగా ఫిర్యాదు చేసారు. నాటి దేవాదాయశాఖ యంత్రాంగం విచారణ చేపట్టలేదు. ఆలయంలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్న అవినీతిపై భక్తులు, నాయకుల ఆవేదన అరణ్య రోదనగా మారింది.


దేవాదాయ శాఖ కమిషనర్ కు 2018, ఆగస్టు 4న చేసిన లిఖితపూర్వక చేసిన ఫిర్యాదు పత్రంలో అవినీతి అక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి..

ఫిర్యాదు పత్రం ఇన్ వార్డుకు ఇనిషియల్ చేసిన కమిషనర్


👉 సెనరికుప్పం విజయలక్ష్మి అనే NRI భక్తురాలు కుటుంబ సభ్యులతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని మొక్కలు తీర్చుకొని దాదాపు ఐదు లక్షల విలువ గల వజ్రాలు పొదిగిన నాలుగు బంగారు గాజులు హుండీలో వేయమని ఇవ్వడంతో అట్టి గాజులను ఆలయ సిబ్బందా ? అధికారులా ? మాయం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


👉 నిజాంబాద్ కు చెందిన ఓ భక్తుడు ఆలయ అవసరాల నిమిత్తం భూమి కొనుగోలు చేయడానికి ₹ 24 లక్షలు ఇచ్చాడని. ఇందులో 16 లక్షలు చెక్కు మరో 8 లక్షలు నగదు ఆలయ అధికారికి ఇవ్వగా ₹ 20 లక్షలతో భూమి కొనుగోలు చేసీ, ₹ 40 వెలతో మురికి కాలువ నిర్మించి, ₹ 3,60000/- ( మూడు లక్షల అరువదివేలు ) స్వాహా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


👉 యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధాన అర్చకుడు లక్ష్మి నరసింహ చార్యులు, ధర్మపురి స్వామి ని దర్శించుకొని స్థానిక అర్చకుల విశ్రాంత వసతి గృహా నిర్మాణంకు ₹ 3 లక్షల రూపాయలు ఇచ్చారు. అట్టి నిర్మాణం నేటికీ పూర్తికాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.


👉 నిత్యవసర సరుకులు, పూజా సామాగ్రి, వస్త్రాల కొనుగోలు, నెయ్యి కొనుగోలు, లడ్డూలు కవర్లు బాక్సుల కొనుగోలు, పండుగ,జాతర ఉత్సవాలలో లేబర్లను నియమించినట్టు తప్పుడు ఓచర్లు తో డబ్బులు స్వాహా, గోదావరి తీరంలో స్వామివారి ప్రసాదాల అమ్మకాల పేరిట ₹ అరు వేల రూపాయల ఖర్చులు రికార్డులలో నమోదు చేసి, ప్రసాదాల విక్రయాల ద్వారా ₹ 1000/- ఆదాయం వచ్చినట్టు రికార్డులలో నమోదు అయిందని ఫిర్యాదుల పేర్కొన్నారు.
ఫిర్యాదు లో పేర్కొన్న దాదాపు 28 అంశాలలో జరిగిన అవినీతి అక్రమాల జరిగిన తీరు తెన్నులను వారు పేర్కొన్నారు.


👉 గాజుల మాయం పై సమావేశం ?


ఆలయ అవినీతి అక్రమాల పై కమిషనర్ కు ఫిర్యాదు చేసిన అంశంపై ఆలయంలో కొందరు ఉద్యోగులు, ఆనాటి బీఆర్ఎస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించుకున్నారు. అధికారులు విచారణ జరిపితే అందరి బండారం బయటపడుతుందని మధ్యస్థంగా ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. బంగారు గాజులు స్వామివారి హుండీలో వేయడానికి ఉద్యోగి కి ఇచ్చిన ఎన్నారై భక్తురాలి రక్త సంబంధీకుడితో కొందరు చర్చలు జరిపారు. అతడికి ఉద్యోగి ద్వారా దాదాపు ₹ 2 నుంచి 3 లక్షల రూపాయలు నగదు ను మధ్యవర్తుల సమక్షంలో అప్పగించారు. దీంతో ఫిర్యాదు లో ఈ అంశం ప్రాధాన్యత తగ్గింది అని ఆలయ ఉద్యోగుల్లో చర్చ.

మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి, వి సుధాకర్ శర్మ, కస్తూరి మురళి నందగిరి ఫిర్యాదు పత్రంలో వారి సంతకాలు.


👉 ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి 2018 సెప్టెంబర్ – అక్టోబర్ మాసంలో అధికారులు ఆలయం నుంచి కొన్ని పేమెంట్ బిల్ బుక్స్, రికార్డులను హైదరాబాద్ దేవాదాయ శాఖ కార్యాలయానికి తీసుకు వెళ్లినట్టు సమాచారం. గత ఐదు సంవత్సరాలుగా విచారణ జరగకుండా చర్యల కోసం గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నాయకుల పాత్ర ప్రధానం అనే చర్చ ఉంది.


స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్, జోక్యం చేసుకోని, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, లేదా సిబిసిఐడి అధికారులతో విచారణ జరిపితే విచారణలో అడ్డుకుంటున్నది ఎవరు ? అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయి ? ఎన్నారై భక్తురాలు ఇచ్చిన బంగారు గాజులు ఎవరు స్వాహా చేశారు ? సమస్య పరిష్కారం కోసం పంచాయతి పెట్టింది ఎవరు అనే అంశాలు వెలుగు చూసే అవకాశం తో పాటు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి న్యాయం జరుగుతుందని భక్తజనం ముక్తకంఠంతో కోరుతున్నారు.