J. SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులతో కలిసి
రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఉచిత
అన్నదాన భోజనం చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్ల ను పర్యవేక్షణ, పరిశీలన కోసం మంగళవారం కమిషనర్ హనుమంతరావు కొండగట్టు, ధర్మపురి, వేములవాడ ఆలయాలను సందర్శించారు.
ఈ నేపథ్యంలో ధర్మపురి ఆలయంలో భక్తులకు ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పక్షాన నిత్యం ఉచిత అన్నదాన నిర్వహిస్తారు. స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అధికారులు, కమిషనర్ హనుమంతరావు కు ఆయన వెంట వచ్చిన అధికారులకు గదిలో ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు.

ఉచిత అన్నదాన నిర్వహణ తీరును, వంటశాలను, అన్నదానం కోసం వండిన వంటకాలను కమిషనర్ పరిశీలించారు. పైన గదిలో భోజనాలు ఏర్పాటు చేశాం అంటూ అధికారులు కమిషనర్ ను భోజన కార్యక్రమానికి ఆహ్వానించారు. తాను భక్తులతో పాటు ఇక్కడే భోజనం చేస్తాను, అని కమిషనర్ ఈవోకు స్పష్టం చేశారు.

భక్తుల తో పాటు కమిషనర్ వారితో కలిసి భోజనం చేసారు. ప్రతిరోజు ఇలానే రుచికరమైన వంటలు భక్తులకు అందిస్తున్నారా ? అంటూ ఆలయ అధికారులను కమిషనర్ అడిగారు. భక్తులతో భోజనం ఎలా ఉంది ? వంటకాలు రుచికరంగా ఉన్నాయా ? మీ పట్ల సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది ? స్వామి వారి దర్శనం బాగా జరిగిందా ? అంటూ భక్తులతో కమిషనర్ ముచ్చటించారు. ఆలయ స్వీపర్లు తమకు చాలీచాలని జీతాలు ఉన్నాయని. తమ జీవితాలు పెంచాలని కమిషనర్ ను వేడుకున్నారు. ఆలయ ఆదాయం లో ఖర్చు 30% కు లోబడి ఉందా ? అంటూ ఈవోను ప్రశ్నించారు ? 60 శాతం కు చేరిందని ఈవో వివరణ ఇచ్చారు
ఈ నెల 31న జూనియర్ అసిస్టెంట్ రవీందర్ పదవి విరమణ చేయనున్న సందర్భంలో శాఖ పరమైన సాంకేతిక సమస్య వచ్చింది, సమస్య పరిష్కారం కోసం సోమవారం హైదరాబాద్ వచ్చానని ఉద్యోగి రవీందర్ కమిషనర్ కు మొరపెట్టుకున్నరు. స్పందించిన కమిషనర్ హైదరాబాద్ లో తన కార్యాలయానికి ఫోన్ చేసి రవీందర్ కు సంబంధించిన సమస్యను పరిష్కరించారు. మీకు ఉద్యోగ సంబంధిత ఏ సమస్య ఉన్న హైదరాబాద్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, వాట్సాప్ ద్వారా నాకు సమాచారం ఇవ్వండి పరిష్కరిస్తానంటూ ఉద్యోగికి కమిషనర్ హామీ ఇచ్చారు. రవీందర్ పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో కమిషనర్ ఆయనకు శాలువ కప్పి అభినందనలు తెలిపారు. గత పుష్కరాలలో పనులు చేసిన కాంట్రాక్టు సంస్థలకు ఆలయ నిధుల నుంచి చెల్లించిన మొత్తం రికవరీ కోసం ఆలయం నుంచి లేఖలు వ్రాశారా ? అని ఈ వో ను ప్రశ్నించారు ? ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా భూసేకరణ అంశం ఏ స్థాయిలో ఉందని ఈవోను అడిగారు.