J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్ర ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం కనుల పండుగగా జరిగింది.

ఆలయ ప్రాంగణంలో గల శేషప్పకళా వేదికపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవం తోపాటు శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, అర్చకులు అశ్విన్ కుమార్, నంభి అరుణ్ కుమార్ , కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ,సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, మరియు అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
శ్రీ రామాలయంలో…

గోదావరి నది తీరంలో గల శ్రీ రామాలయంలో జరగనున్న సీతారాముల కళ్యాణం మహోత్సవానికి స్థానిక ,శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం పక్షాన స్వామి వార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, మేళ తాళాలతో ఊరేగింపుగా తాడూరి వంశీయులకు అందించారు.

ఇట్టి కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, వేదపండితులు, ముత్యాల శర్మ, పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు , సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వావిలాల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.