ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మార్నింగ్ వాక్, వాలీబాల్ ఆట !

👉పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో…


J.SURENDER KUMAR,

ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సోమవారం ధర్మపురి పట్టణంలో మార్నింగ్ వాక్ చేస్తూ, వాలీబాల్ ఆడుతూ విన్నుతంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే జూనియర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా మైదానంలో క్రీడాకారులతో కలిసి వాలి బాల్ ఆడారు.

పట్టణంలోని సమీకృత మార్కెట్ ని సందర్శించి కూరగాయలు అమ్మే వ్యాపారస్తులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి వంశీ గెలిపించాలని ఓటర్లను కోరారు.


👉పరామర్శ..


ధర్మపురి క్షేత్రంలో ప్రముఖ జ్యోతిష్య పండితుడు ఓం సాయి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకుడు. గొల్లపల్లి సంతోష్ శర్మ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వరామర్శించారు. సంతోష్ శర్మ మాతృమూర్తి గత కొన్ని రోజుల క్రితం స్వర్గస్తులైనారు.