👉గత ప్రభుత్వంలో ఇష్ట రాజ్యంగా నిధులు తరలింపు.
👉 అప్పు తెచ్చి కాంట్రాక్టర్లకు చెల్లించారు
J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కోట్లాది రూపాయల
ఆదాయంను, గోదావరి పుష్కరాలలో పనులు చేసిన
కాంట్రాక్టర్లకు చెల్లించారు. గత ప్రభుత్వంలో అధికారులు ఇష్ట
రాజ్యాంగ నిధులు తరలించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో
డబ్బులు కొరత ఏర్పడితే మరో ప్రముఖ ఆలయం నుంచి ₹
50 లక్షల అప్పు తెచ్చి కాంట్రాక్టర్లు కు మూడు విడుతలలో
చెల్లించాల్సిన అవసరం ఎందుకనేది నేటికీ అంతు పట్టని
మిస్టరీ.
వివరాల్లోకి వెళితే.
సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదికి పుష్కరాలు వచ్చాయి. సీఎం కేసీఆర్ 2015, జూలై 14న ధర్మపురిలో పుష్కర స్నానం చేసి మొక్కలు తీర్చుకున్నారు. 12 రోజులపాటు ఘనంగా జరగనున్న పుష్కరాలలోభక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, RWS, వైద్య ఆరోగ్య, తదితర శాఖలకు నిధులు కేటాయించి పట్టణంలో ఆలయంలో గోదావరి నది తీరంలో వివిధ పనులు చేపట్టారు.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు బినామీ పేర్లతో సబ్ కాంట్రాక్ట్ పనులు చేశారు. అయితే కాంట్రాక్టు పొంది రికార్డుల లో పనులు చేసిన సంస్థలకు ఆలయ నిధులను రాజకీయ ఒత్తిడితో అధికారులు చెల్లించారు. చెల్లింపుల్లో నిధుల కొరత ఏర్పడడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నుండి ధర్మపురి ఆలయం పేరిట ₹ 50 లక్షల రూపాయలు అప్పుగా తెచ్చి 20 కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లించడం ప్రత్యేకత.
( నేరుగా ఆలయ నిధుల నుండి చెక్కుల ద్వారా కాంట్రాక్టర్లకు చెల్లించిన ఘనత ధర్మపురి ఆలయ అధికారులకే దక్కుతుంది.)
👉ఉమ్మడి రాష్ట్రంలో ధర్మపురి ఆలయానికి నిధులు ఇచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో స్వర్గీయ మాజీ దేవాదాయ శాఖ మంత్రి. జువ్వడి రత్నాకర్ రావు. ధర్మపురి ఆలయ అభివృద్ధి పనులు కోసం నాడు ప్రముఖ ఆలయాల నుండి లక్షలాది రూపాయలు నిధులు ధర్మపురి ఆలయానికి కేటాయించి అభివృద్ధి పనులు చేశారు. సాధించుకున్న రాష్ట్రంలో వేములవాడ ఆలయం నుంచి లక్షలాది రూపాయలు అప్పు తెచ్చుకునే దురదృష్ట దుస్థితి నాటి ప్రభుత్వంలో ధర్మపురి నరసింహుడికి ఏర్పడింది.
ధర్మపురి ఆలయ నిధులు మళ్లింపు పై ఆలయ పాలకవర్గ మాజీ చైర్మన్ జువాడి కృష్ణారావు 2018, ఆగస్టులో అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ కు సంబంధిత శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన వారు చర్యలు తీసుకోలేదు

.
👉పుష్కరాలలో ఆలయానికి చేకూరిన ఆదాయం !
₹ 2,38,90,156 కోట్లు ( రెండు కోట్ల 38 లక్షలు, 90 వేల,156 రూపాయలు)
👉12 రోజుల ఆదాయ వివరాలు ;
టిక్కెట్ల ద్వారా, ₹ 6,46,178/-. ప్రత్యేక దర్శనం ద్వారా ₹ 41,44,300/-. ప్రసాదాల ద్వారా ₹60,70,470/- అన్నదానం ద్వారా.₹ 40,10,380/- హుండీ ద్వారా.₹ 90,18,828/- మొత్తం ఆదాయం ₹ 2 కోట్ల, 38 లక్షల 90 వేల,156/-.
👉20 కాంట్రాక్టు సంస్థల కు ఆలయం చెల్లించిన మొత్తం.
₹. 1,55,39,922/- ( కోటి 55 లక్షల 39 వేల,922/-)
ఇందులో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ అనుమతితో ₹ 45,88,488/-( బ్యాంకులో డిపాజిట్లు రద్దుచేసి )
ఈ నిధులలో. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అప్పుగా తీసుకున్నవి. ₹ 50 లక్షలు ఉన్నాయి.
👉చెల్లింపులు ఇలా..
ఎస్ ఆర్ ఆర్ ధర్మశాల ప్రత్యేక మరమతుల పేరిట. మొదటి విడత. ₹ 2,00,117/- రెండో విడత, ₹ 3, 40, 866/- మూడో విడత ₹ 2, 97, 186/- మొత్తం ₹ 8, 38,169/- చెల్లించారు. కాంట్రాక్ట్ సంస్థ పాన్ కార్డు నెంబర్. AEEPT 8420 M. ఇలా మొత్తం 20 కాంట్రాక్టు సంస్థలకు ఆలయ నిధుల నుండి ₹ 1,55,39,922/- చెల్లించారు.

కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లించిన ఆలయ నిధులను ప్రభుత్వం నుండి తిరిగి రాబట్టి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఖాతాలో జమ చేయాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ను, స్థానికులు, భక్తజనం ముక్త కంఠంతో కోరుతున్నారు.
.
.