ఎన్నికల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి !

👉వ్యయ పరిశీలకులు డి.ఎం. నింజే !

J.SURENDER KUMAR,

ఎన్నికల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంటు నియోజక వర్గం వ్యయ పరిశీలకులు డి.ఎం. నింజే అన్నారు.


శనివారం జగిత్యాల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లా కలెక్టర్ తో కలిసి వివిధ ఎన్నికల విభాగం అధికారులతో సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధించిన అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, మాడల్  కోడ్ అమలు పరచాలని అన్నారు.

ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు విధులు నిర్వహించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన అన్ని టీమ్ లను ఏర్పాటు చేశామని, అధికారులు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు అని వివరించారు.


అనంతరం జిల్లా మానిటరింగ్ సెల్, కంట్రోల్ రూం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ లను ఆయన పరిశీలించారు.


ఈ కార్యక్రమంలో  జగిత్యాల, కోరుట్ల ఆర్డీఓ లు మధుసూదన్, ఆనంద్ కుమార్, జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ రఘువరన్, ఇన్ కమ్ టాక్స్ అధికారులు, ఏఈఓ లు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.