J.SURENDER KUMAR,
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంధర్బంగా ఆలయ అర్చకులు స్వామి వారు తీర్థ ప్రసాదాలు ఎమ్మెల్యే కు అందించారు.

👉ప్రత్యేక పూజలు..

ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినం పురస్కరించుకొని స్థానిక శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు అర్చకులచే అభిషేకం, అర్చన ప్రత్యేక పూజలు జరిపించారు.

👉క్యాంపు కార్యాలయంలో..

కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిపిన జన్మదిన వేడుకల లో లక్ష్మణ్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. డిజే పాటల తో కార్యకర్తలు నృత్యాలు చేస్తూ గజమాలతో ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యేతో కేక్ కట్ చేయించారు.
👉నేరెళ్ల గ్రామంలో..

మండలంలోని నేరెళ్ళ గ్రామంలో శ్రీ సాంబశివ ఆలయంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినం సంధర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు.
👉పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ!

ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినం సందర్భంగా పెద్ధపెల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ, ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి లక్ష్మణ్ కుమార్ ను గ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
👉పరామర్శ..

పట్టణం కు చెందిన TV ఛానల్ రిపోర్టర్ కొంక సుదీర్ ఇంటికి వెళ్లి ఆయన కుమారుని పరామర్శించారు. ప్రమదశాత్తు కింద పడి చెయ్యి విరిగింది. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు..