గ్రామీణుల ఇష్టదైవం బీర్పూర్ నరసింహుడు!

👉 బీర్పూర్ నరసింహుడు భక్తుల పాలిట కొంగు బంగారం!

👉 ” స్వర్ణాసన పీఠాయ దండకారణ్య వాసినే, శ్రీమద్భీర్పురీశాయ శ్రీనృసింహాయ మంగళం:”

J.SURENDER KUMAR,

బీర్ పూర్ ఈ గ్రామం పేరు, జాతీయ, అంతర్జాతీయ

ప్రచారం మాధ్యమాలలో పలుమార్లు మారు మోగింది,

మోగుతూనే ఉంది. వామపక్ష భావాజాలం కు, ప్రశ్నించే

తత్వానికి, దేశ రక్షణలో తమ వంతు కర్తవ్యంగా సైన్యంలో

సైనికుల పాత్రను పోషిస్తూ ప్రత్యక్షంగా నిలిచిన గ్రామం బీర్

పూర్. భక్తి ప్రవృత్తుల తో భగవంతుడికి ప్రత్యేక పూజది

కార్యక్రమాల నిర్వహణకు కలసికట్టుగా తమ గ్రామ శివారులో

వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం ఈ

గ్రామ ప్రజలు అహో రాత్రులు కృషిచేసినా కార్యక్రమాలకు

నిలువెత్తు నిదర్శనం బీర్ పూర్ నరసింహ ఆలయం.

చుట్టూ ఎతైన గుట్టలు, దట్టమైన అడవి, అందులో వెలసిన

శ్రీ లక్ష్మీనరసింహస్వామికి శతాబ్దాల కాల క్రితమే ఆలయ

నిర్మాణానికి, నిత్య పూజాది కార్యక్రమాలకు, జాతర

ఉత్సవాలకు ఆ గ్రామానికి చెందిన తరతరాల పెద్దలు చేసిన

కృషి కి వెలకట్టలేనివి.


👉ఆలయ చరిత్ర…

గ్రామ శివార్లలో పెద్ద గుట్ట, చిన్న గుట్టల పై వెలసిన శ్రీలక్ష్మీనర సింహ స్వామి భక్తుల పాలిటి కొంగుబంగారంగా, కరుణా కటాక్ష మూర్తిగా, దుష్ట శిక్షకుడుగా, శిష్ట రక్షకుడుగా ప్రసిద్ధి.
పూర్వం అవుసు ల ధర్మయ్య అనే ఉపాధ్యాయుడు, తన కుమారుని తో విభేదించి, శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని ఆశ్రయించి మొర పెట్టుకున్నట్టు కథనం.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మూలవిరాట్

సనాతన ఆచార వ్యవహారాలు, చులకన చేసే తన కొడుకును కడతేర్చి తన పరువు కాపాడితే, స్వామివారికి కస్తూరి తిలకం దిద్దుతానాని ఉపాధ్యాయుడు ధర్మయ్య స్వామి వారికి మోక్కుకున్న అదేవిధంగా జరిగిందని, వెంటనే తన మొక్కును ఉపాధ్యాయుడు ధర్మయ్య తీర్చుకున్నాడు అనే కథ ఈ ప్రాంతంలో అనాధి గా ప్రచారంలో ఉంది.

👉 మరో చారిత్రక కథనం !

గుర్రపు డెక్క

నేరేళ్ళ గ్రామానికి చెందిన యాదవ బాలుడు, తన మేకలను మేపుతూ, ఒ రోజున చిన్నగుట్ట పైకి వెళ్ళగా, బాలుని రూపంలో అగుపించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి తన దాహం తీర్చమని యాదవ బాలుడిని కోరారు. ఆ సమయంలో యాదవ బాలుడు తన మేకలను గుట్ట గుహ లోనికి తీసుకొని పోయి, వాటి పాలతో బాలుడు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దాహాన్ని తీర్చాడు. తరువాత బాలుడు గుట్ట దిగుతూ వెను తిరిగి చూడగా తన మేకల మంద అనూహ్యంగా రెట్టింపు కావడంతో, అశ్చర్య చకితుడై, దానిని బాలుడి రూపంలో దాహం అని అడిగిన శ్రీ స్వామి కృపగా భావించాడు. అనేది కథనం.

స్వామివారి ప్యారేట్ ఉత్సవం, బాణం గుర్తు ఉన్నది గుటపై స్వామివారి ఆలయం !

జరిగిన సంఘటనను నేరేళ్ళ గ్రామ సంస్థానాధీశునికి విషయం చెప్పాడట. అంతకు ముందు రోజు స్వామి తనకు కలలో కనిపించి, ఆలయ నిర్మాణానికి సహకరించమని స్వామి కోరి న విషయం గుర్తెరిగిన సంస్థానా ధీశుడు వెంటనే నమ్మనాచార్యులకు కబురు పంపాడు. సంస్థానాధీశుడి సహకారంతో, నమ్మనాచార్యులు అప్పటికే వెలసిన స్వామిని కనుగొని భక్తి శ్రద్ధలతో పూజించి, ఆలయ నిర్మాణం పూర్తి చేసినట్టు కథనం ప్రాచుర్యంలో ఉంది.

స్వామివారి దోపు కథ

అప్పటినుండి ప్రతి ఏటా స్వామి వారి జాతర ఉత్సవాలు నిర్వహిస్తు న్నట్లు చెపుతారు. దేవాలయ ఉత్సవ నిర్వహణకై ఖుతుబ్ షాహీల కాలంలో మాన్యాలు ఇచ్చారు అని, అయితే ఢిల్లీ సుల్తానులు, ఖుతుబ్ షాహీల పై దండెత్తి గోల్కొండను కైవసం చేసుకున్నాక, అట్టి మాన్యాలను రద్దు పరచినట్లు చెపుతారు. 1881లో నిజాం ప్రభువులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారల పేరున ఉన్న మాన్యాలను ఆలయ ధర్మకర్తలు, ప్రధానాచా ర్యుడైన వొద్దిపర్తి రామానుజాచార్యుల నుండి తిరిగి తీసుకున్నారని చారిత్రికా ధారాలున్నట్లు చెపుతారు.

ఆ తర్వాత అర్చకులు తుంగూరు, భీర్పూరు, నర్సింహుల పల్లె తదితర గ్రామాల్లో భిక్షాటనచేసి ఉత్సవాలను నిర్వహించారు. అదేవిధంగా అర్షకోట పరగణా క్రింద గల గ్రామాల ప్రజలు స్వామివారి ఉత్సవాల నిర్వహణకు కానుక లను సమర్పించడం అనవాయితీ గా మారింది.

👉వరద పాయసం !

వరద పాయసం పూజలు చేస్తున్న అర్చకులు

ప్రతి ఏటా గుట్ట కింద గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో స్వామి వారి కొండపైకి వెళ్లి అర్చకులు వేద పండితుల తో ప్రత్యేక పూజలు నిర్వహించి, కొండపైగల మీద పాయసం ను ( వరద పాశం) కుమ్మరించి, పాయసం రాతి బండపై నుంచి కారుతున్న పాయసం ను, రైతులు, భక్తులు ప్రసాదం గా స్వీకరించి, ఏట వర్షాలు పుష్కలంగా పడాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, శ్రీ స్వామి వారి వరద పాయసం ను ప్రసాదంగా స్వీకరిస్తారు.

రాతిబండపై పాయసం కుమ్మరిస్తున్న అర్చకులు

👉ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో జరిగే జాతర ఉత్సవాల వివరాలు..

స్వామివారి వనవహోత్సవం

కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, పుట్టబంగారం సాయంతం 6గంటలకు గుట్టపైకి ఊరేగింపు, సాయంత్రం ధ్వజారోహణం, ఎదుర్కోళ్ళు, సాయంత్రం స్వామి వారల కల్యాణం, సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన, స్థాళిపాక హోమము, బలిహరణం, ఉదయం 1 వసంతోత్సవం, క్షీరసాగర మథనం, చందనోత్సవం, తెప్పోత్సవం, డోలోత్సవం, మద్యాహ్నం పార్వేట్ ఉత్సవం, వనమహోత్సవం, రాత్రి వేద సదస్సు, ఉదయా త్పూర్వం 4గంటలకు దోపుకథ, మద్యాహ్నం మహా పూర్ణాహుతి, సాయంత్రం రథోత్సవం, రాత్రి నాగబలి, చక్ర తీర్థం, ఏకాంతోత్సవం, ఉదయం ఏకాదశ కలశ స్వపన తిరు మంజనం, పవిత్రో త్సవం, ప్రధాన కార్యక్రమా లు జరుగుతాయి.

వరద పాయసం నిర్వహించే పెద్దగుట్ట