గుండారం రిజర్వయార్ కు నీరు విడుదల మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు !

J.SURENDER KUMAR,

మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు అధికారులు పెద్దపల్లి

జిల్లా జూలపల్లి మండలములోని కుమ్మరి కుంట గ్రామంలో

SRSP D 83 కెనాల్ వద్ద SE మరియు మంథని EE

సంబంధిత అధికారులతో కలిసి గుండారం రిజర్వయార్ లోకి

సోమవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు.


ఈ కార్యక్రమంలో రామగిరి ఎంపీపీ అరెళ్ళి దేవక్క కొంరయ్య, పెద్దపల్లి జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ ముసుకుల సురేందర్ రెడ్డి, మంథని, ముత్తారం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఐలి ప్రసాద్, దొడ్డ బాలాజీ, మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముస్త్యాల శ్రీనివాస్ సంబంధిత అధికారులు ఉన్నారు

👉 మంత్రి శ్రీధర్ బాబు పరామర్శలు

కరీంనగర్ లో కరీంనగర్ సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అఖిల్ గుండెపోటుతో ఇటీవల మృతి చెందారు. సోమవారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.


👉 కరీంనగర్ అభినవ్ హాస్పటల్ లో మంథని పట్టణానికి చెందిన రాకేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. రాకేష్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.