👉25 మంది ప్రత్యేక పోలీసుల అధికారులు బృందం ?
J.SURENDER KUMAR,
కెసిఆర్ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డిని 25 మంది పోలీసుల బృందం ఆయన
కదలికలపై ఆరా తీసింది. నాటి సీఎం కెసిఆర్ తో సహా
బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై రేవంత్ ప్రత్యక్షంగా, వ్యక్తిగతంగా
పలు అవినీతి ఆరోపణలు చేసినందున
రేవంత్ రెడ్డి కదిలికల పై 24/7 నిఘా పెట్టినట్టు ఫోన్
ట్యాపింగ్ విచారణలో ఈ అంశం వెలుగు చూసినట్టు
సమాచారం.
ఇంటెలిజెన్స్ కీలక ఉన్నతాధికారులు తమకు అత్యంత విశ్వనీయంగా, ఉండే సమర్ధులైన అధికారులను ఎంపిక చేసి, రేవంత్ రెడ్డిని ట్రాక్ చేయడానికి 25 మంది పోలీస్ అధికారుల బృందం ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా వివిధ రకాల నిఘా పనులను అప్పగించారు. ఫోన్ ట్యాపింగ్, బంజారాహిల్స్ ఇంటి దగ్గర నిఘా ఉంచడం, రేవంత్ రెడ్డికి ఆర్థికంగా మద్దతు ఇచ్చే ఫైనాన్షియర్ల ను గుర్తించడం వారి కదలికలు, వ్యాపార లావాదేవీలు, ముఖ్యంగా ఎన్నికల సమయంలో వారి కదలికలను ట్రాక్ చేస్తూ కీలక అధికారులకు సమాచారం ఇచ్చే బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది
ఈ నేపథ్యంలో పలువురు ప్రతిపక్ష నాయకులను ట్రాక్ చేస్తున్నప్పటికీ, టార్గెట్ నంబర్ వన్, రేవంత్ రెడ్డి కాగా, టార్గెట్ నెంబర్ టు స్థానంలో BRS మాజీ మంత్రి , ప్రస్తుత బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఉన్నారు అనే సమాచారం విచారణలో వెలుగు చూసినట్టు చర్చ. 2021లో కేసీఆర్‌తో విభేదించిన తర్వాత ఈటల కదలికలను ట్రాక్ చేసినట్టు విచారణలో వెలుగు చూసినట్టు చర్చ.
డిసెంబర్ 2023లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు వరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB)లోని 25 మంది పోలీస ల బృందం రేవంత్ రెడ్డి కదలికలను ట్రాక్ చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది.
రేవంత్ రెడ్డి కదలికలపై నిఘా పెట్టాలనే నిర్ణయాన్ని ఎస్‌ఐబీ స్వతంత్రంగా తీసుకున్నదా ? లేక నాటి బీ ఆర్ఎస్ ప్రభుత్వ నుంచి ఆదేశాలు అందాయా ? అనే సమాచారాన్ని ’ఫోన్ ట్యాపింగ్ కేసును గత నెల రోజులుగా దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారులు కూపి లాగుతున్నట్టు సమాచారం.