కొండగట్టు ఈ ఓ సస్పెండ్ తో దేవాదాయశాఖ లో ప్రక్షాళన !

👉సరుకుల కొనుగోలు వివరాలు కోరిన కమిషనర్ !

👉రేపో, మాపో మరి కొందరి పై చర్యలు ?

👉కమిషనర్ కార్యాచరణతో మొదలైన కలవరం!

J.SURENDER KUMAR,

కొన్ని ప్రముఖ ఆలయాల అధికారుల అవినీతి , అక్రమాలపై

వచ్చిన ఫిర్యాదుల ప్రక్షాళనకు దేవాదాయ శాఖ శ్రీకారం

చుట్టినట్టు సమాచారం. భక్తుల ప్రసాదాలకు, ఉచిత

అన్నదానానికి, స్వామి వారల నిత్య నివేదనకు కొనుగోలు

చేసిన సరుకుల వివరాలను ఆ శాఖ కమిషనర్ గత ఏప్రిల్

మాసం నుంచి 2024 మార్చి వరకు ప్రత్యేక ఫార్మేట్లో 16

అంశాల లో కోరినట్టు తెలిసింది. అవినీతి ఆరోపణలు పై

డిప్యూటీ కమిషనర్ హోదా గల కొండగట్టు ఆలయ కార్య

నిర్వహణ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ

జరిపి నివేదిక ఆధారంగా కొండగట్టు ఆలయ

కార్యనిర్వహణాధికారి ( డిప్యూటీ కమిషనర్ హోదా ) గత

నెల 23న కమిషనర్ సస్పెండ్ చేయడంతో దేవదాయ

శాఖలో ప్రక్షాళన మొదలైంది. దేవాదాయ శాఖ లో

అక్రమాలకు చెక్ పెట్టడం కోసం కమిషనర్ చేపట్టిన

కార్యాచరణతో కొందరు అధికారులలో కలవరం మొదలైనట్టు

చర్చ.

ఈనెల మొదటి వారం ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయం లో సరుకుల ( దిట్టమ్) గోదాంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలలో వెలుగు చూసిన వివరాల నివేదిక ఆ శాఖ ఉన్నతాధికారి వద్దకు చేరినట్టు సమాచారం. ఈ నివేది ఆధారంగా రేపో, మాపో బాధ్యులపై చర్యలు ఉంటాయని చర్చ. దీనికి తోడు గత సంవత్సరం అక్టోబర్ లో ఆ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ ధర్మపురి ఆలయ సరుకుల గోదాం లో చేపట్టిన తనిఖీలలో వెలుగు చూసి అవకతవకలు, అధిక నిలువల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలలో నిత్యవసర సరుకుల కొనుగోలు వినియోగంపై వారి నుంచి వివరాలను కోరినట్లు తెలిసింది.
ఈ నివేదికల ఆధారంగా ఆలయాలలో సరుకుల కొనుగోలులో తీరు, అక్రమాలపై ఆ శాఖ కమిషనర్ దృష్టి సారించినట్టు సమాచారం.

👉సరుకుల వినియోగం, కొనుగోలు వివరాలు కోరిన దేవాదాయ శాఖ !

సరుకుల వివరాల ఫార్మేట్ !

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలలో (దేవుళ్లకు) స్వామివారల కు నిత్య నివేదన, భక్తులకు ప్రసాదాల విక్రయాల, ఉచిత అన్నదానం కోసం టెండర్ ద్వారా 2023 ఏప్రిల్ – 2024 మార్చి వరకు ఆయా ఆలయాలు కొనుగోలు చేసిన సరుకుల వివరాలు, నెలవారీగా ఎంత మొత్తంలో కొనుగోలు చేశారు ? సరుకులు కొనుగోలు చేసిన మొత్తం, వాటి వివరాలు కోరినట్టు తెలిసింది. కొనుగోలు చేసిన అధికారి పేరు, తేదీ, ఆర్డర్ నంబర్, వివరాలతో పాటు అధికంగా సరుకులను ఆ మాసంలో కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది ? వాటి వివరాలు, ప్రతి ఆలయం నుంచి యుద్ధ ప్రాతిపదిక సమాచారం అందించాలని ఆలయాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

👉 ప్రత్యేక ఆడిట్ అధికారులతో 2018 ఆర్థిక సంవత్సరం నుండి కొండగట్టు ఆలయ ఆదాయం, ఖర్చుల వివరాలను పరిశీలనకు రిటైర్డ్ ఆడిట్ అధికారులు నియామకాలకు ప్రభుత్వం అనుమతి కి నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం.

👉 కమిషనర్ గూర్చి..

దేవాదాయ కమిషనర్ గా గత కొన్ని రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి హనుమంతరావు, ట్రాక్ రికార్డులు రెండు మూడు అంశాలు, ముక్కుసూటిగా, నిబంధనల మేరకే విధులు నిర్వహిస్తారనే గుర్తింపు ఉంది.


సిద్దిపేట ఆర్టీవో గా పనిచేసిన కాలంలో ప్రభుత్వం నుంచి మూడుసార్లు ఉత్తమ అధికారిగా గవర్నర్ ద్వారా అవార్డు, ప్రశంసలందుకున్నారు.

జగిత్యాల ఆర్డిఓ గా విధులు నిర్వహిస్తున్న కాలంలో గోదావరి నది వరదలలో చిక్కుకున్న కూలీల (కురు దీవి ) ప్రాణాలు కాపాడడం కోసం, ప్రభుత్వాని అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన హెలికాప్టర్ తెప్పించి కూలీలను రక్షించారు.


సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు విధులు నిర్వహిస్తున్న సందర్భంలో సైనికులకు కేటాయించిన ప్రభుత్వ భూమి నీ కొందరు అధికారులు ఇతరుల పేర్లపై మార్పు చేసిన అంశంలో ప్రత్యేక అధికారులతో విచారణ జరిపించారు. బాధ్యులైన అప్పటి తహసిల్దార్ , పదోన్నతి పై ఆర్డీవోగా కొనసాగుతున్న అధికారిపై పోలీస్ స్టేషన్ లో నాన్ బేలబుల్ క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు. అధికారిని విధులను తొలగించాల్సిందిగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

ఇలాంటి అధికారి దేవాదాయ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడంతో భగవంతుడి సొమ్ము కు రక్షణ ఉంటుందని భావన భక్తజనం వ్యక్తం చేస్తున్నారు.