👉2018 నుంచి అంజన్న ఆదాయం పై ఆడిట్ చేయనున్నారు !
J.SURENDER KUMAR,
కొండగట్టు అంజన్న ఆదాయ అవకతవకలపై దేవాదాయ శాఖ యంత్రాంగం లేట్ గా స్పందించిన.. లేటెస్ట్ చర్యలకు శ్రీకారం చుట్టడంతో అంజన్న భక్తజనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంజన్న ఆదాయ అవినీతి అంశంపై దేవాదాయ శాఖ ప్రత్యేక ఆడిటర్ల ను నియమించి 2018 ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయ వ్యయలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను సిద్ధం చేయనున్నట్లు సమాచారం.
కొండగట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి నివేదిక ఆధారంగా దేవాదాయ కమిషనర్ ఈవో వెంకటేష్ ను గత నెల 23న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ అధికారిపై నవంబర్ 2022లో పాలకవర్గ చైర్మన్ చేసిన ఫిర్యాదు పై అదే నెల 23న విచారణ చేపట్టి నివేదిక ను కమిషనర్ కార్యాలయం కు సమర్పించారు.

నాటి విచారణ నివేదిక పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పెండింగ్ పెట్టడం తో పాటు ఈవో పై గతంలో ఉన్న పలు ఫిర్యాదులు విచారణకు నోచుకోకుండా పెండింగ్ లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన 2018 ఆర్థిక సంవత్సరం నుంచి ఆడిట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఆడిటర్ల కొరత, త్వరిత గతిన ఆడిట్ పూర్తి చేయడానికి పదవి విరమణ చేసిన (రిటైర్డ్ ఆడిటర్ల ను) ఆడిటర్ల నియామకం కోసం నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వా అనుమతి కోసం పంపించినట్లు సమాచారం.
రిటైర్డ్ ఆడిటర్ల బృందానికి ఒక్కో ఆర్థిక సంవత్సర ఆడిట్ కు ఎంత మొత్తం జీత భత్యాలు చెల్లించాలి ? ఆడిట్ పూర్తి చేయుటకు ఎన్ని రోజుల సమయం కేటాయించాలి ? గతంలో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆడిటర్లు జారీ చేసిన నోటీసుల లో అంశాలు ఏమిటి ? సంబంధిత నోటీసులకు ఈవో ఇచ్చిన వివరణ ఏమిటి ? తదితర అంశాలను, విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రత్యేక ఆడిటర్ల నియామకం కోసం దేవాదాయ శాఖ త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం