👉భక్తులకు ఇబ్బందులు కలగవద్దు !
👉 కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా !
J.SURENDER KUMAR,

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న జయంతి ఉత్సవములకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా సేవలు అందించాలని , అధికారులను, సిబ్బందిని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. హనుమాన్ దీక్షపరుల, భక్తుల సౌకర్యార్థం క్షేత్రంలో 114 సీసీ కెమెరాలతో రెప్పవాల్సింది పహారా, నిఘ ఏర్పాటు చేశామన్నారు.

సోమవారం సాయంత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ దేవస్థానం లోని ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మాల ధారణ చేసుకొని వివిధ ప్రాంతాలనుండి వచ్చే హనుమాన్ భక్తుల సౌలభ్యం కోసం భారీ ఏర్పాట్లు చేశామని తెలిపారు.

తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్లి వస్తు తిరిగి చేరుకోవడం జరుగుతున్నదని తెలిపారు. మహిళా భక్తులకు ప్రత్యేకంగా షవర్ లను, బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మాలధారణ ఏ విధంగా స్వచ్చమైన మనసుతో కాలినడకన వచ్చారో అదే స్పూర్తితో దర్శనం చేసుకొని వెళ్ళాలని భక్తులకు కోరారు.

దేవుని ప్రసాదం కొరకు క్యు లైన్ 12 కౌంటర్లను ఏర్పాటు చేశామని, అవసరం మేరకు మరిన్ని కౌంటర్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రత్యేక దర్శనం, మాల విరమణ, కేశఖండనం టికెట్ లకు 6 కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు సంయమనం పాటించి భక్తి శ్రద్ధలతో స్వామి వారి దర్శనం చేసుకోవాలని తెలిపారు.

వేసవి కాలం దృష్ట్యా ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నీడ పట్టున ఉంటూ, నీటిని ఎక్కువగా తాగాలని తెలిపారు. పారిశుధ్య పనులను, కోనేరు, కేశఖండనం, పోలీసు కంట్రోల్ రూం ను పరిశీలించారు. . మొదటి రోజున సుమారు 30,000 మంది భక్తులు దర్శనానికి వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీఓ మధుసూదన్, DSP రఘు చందర్, ఆలయ ఈఓ చంద్రశేఖర్, జాతర ప్రత్యేక అధికారి కృష్ణ ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి దెవరాజ్, DBCDO సాయి బాబా, DSCDO రాజ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి లక్ష్మి నారాయణ, వివిధ శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.