మాజీ మంత్రి ఈశ్వర్ రైస్ మిల్లర్లతో కుమ్ముకై రైతులను దోచుకున్నాడు !

👉ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు !

J. SURENDER KUMAR,

మాజీ మంత్రి ఈశ్వర్ కు ధర్మపురి నియోజకవర్గ ప్రజలు

నాలుగు సార్లు అవకాశం ఇస్తే జేబులు నింపుకునే ఆలోచన

తప్ప, ధర్మపురికి నువ్వు ఏం చేశావో చెప్పాలని

మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆరోపించారు.


ధర్మపురి పట్టణంలో గురువారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్

ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పార్లమెంటు సన్నాహక

సమావేశానికి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా

పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…
తరుగు పేరుతో మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోపిడీ చేసిన వ్యక్తి కాంట్రాక్టర్లకు కొమ్ము కాసిన వ్యక్తి, ఎఫ్ సి సిఐ ఉద్యోగాలు అమ్ముకున్న వ్యక్తి ఈశ్వర్ కు ఓట్లు వేస్తారో ? ఈ ప్రాంత అభివృద్ధి కోసం తపనపడిన సేవ చేసిన కాక వెంకటస్వామి వారసత్వాన్ని ఉనికి పుచ్చుకున్న వంశీని ఆదరిస్తారో ఓటర్లు త్వరలో తీర్పు చెప్పనున్నారని మంత్రి అన్నారు.


కుటుంబం పాలన అని అతని పై విమర్శలు చేస్తున్న ఈశ్వర్ ధర్మపురి అసెంబ్లీ లో ఓటమి చెంది, ఇక్కడ చెల్లనీ రూపాయి ఈశ్వర్, పార్లమెంటులో ఎలా చెల్లుతారు ఆని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం తపనపడిన సేవ చేసిన కాక వెంకటస్వామి వారసత్వాన్ని ఉనికి పుచ్చుకున్న వంశీని ఓటర్లు ఆదరిస్తారని శ్రీధర్ బాబు అన్నారు.


గోదావరి పరివాహక ప్రాంతంలో 3బ్యారేజీలు కట్టినా ఈ ప్రాంతంలో ఎకరానికి నీళ్లు అందించలేదని ఇక్కడి నుంచి నీళ్లు సిద్దిపేట, గజ్వేల్ తరలిస్తున్న మంత్రిగా ఉన్న ఈశ్వర్ ఏనాడు అడ్డుకో లేదనీ విమర్శించారు. . మూడో టీఎంసీ పేరుతో ఇక్కడి నీరును తరలించుకు పోతుంటే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ కోసం కక్కుర్తి పడ్డాడని ఈశ్వర్ పై మండి పడ్డారు.ఈ ప్రాంతాన్నిలిఫ్ట్ ల ద్వారా సస్యశ్యామలం చేస్తామనీ హామీ ఇచ్చారు. టె లాండ్ భూములన్నీ సస్యశ్యామలం కావాలంటే పత్తి పాక రిజర్వాయర్ తోనే సాధ్యం అన్నారు. పడుతుందన్నారు.


ఎన్నికల తర్వాత దీనిని సాంక్షన్ చేస్తామన్నారు రైతుకు మేలు జరుగాలి. టిఆర్ఎస్ దోపిడీ ప్రభుత్వానికి అసెంబ్లీ ఎన్నికల్లో చరమ గీతం పాడారు. అదే విధంగా పార్లమెంటు ఎన్నికల్లో సైతం కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.


ఎఐసిసి గుర్తించిన యువ నాయకుడు ప్రజాసేవ చేయాలనే అసక్తి ఉన్న వ్యక్తి గడ్డం వంశీ అని ఇతడిని గెలిపిస్తే ఈ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని అదే విదంగా ధర్మపురిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని మంత్రి శ్రీధర్ బాబుహామీ ఇచ్చారు.
గింజ తరుగు లేకుండా ధాన్యం కొనుగొలు చేస్తున్నామని ప్రజలంతా కాంగ్రెస్ కు ఓటుద్వారా మద్దతు తెలుపాలన్నారు.
రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతని మోసం చేసిన బీ జేపీ ఏ మొకంతో ఓట్లు అడుగుతారో చెప్పాలి అని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. జైశ్రీరామ్ నినాదంతో దేశాన్ని మోసం చేస్తున్న మోడీకి ఓటు వేస్తారో , బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండబోతున్న రాహుల్ గాంధీ కి ఓటు వేస్తారో తేల్చుకోవాలన్నారు. డిగ్రీ యువతకు ప్రతినెల 8500 రూపాయలను కార్మికులను కర్షకులను బడుగు బలహీన వర్గాలను ఆదుకునే కార్యక్రమాలను కాంగ్రెస్ చేపట్ట బోతుంద న్నారు


. జీవన్ రెడ్డిని కూడా నిజమా బాద్ లో ఎంపి గా గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఉన్నాము వంశీని రెండు లక్షల మెజార్టీ తక్కువ కాకుండా గెలిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు దీమా వ్యక్తం చేశారు.


మన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అడిగినట్లు ధర్మపురిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు.


👉ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీ మాట్లాడుతూ..


ధర్మపురి తో పాటు నిజామాబాద్ లో తనను కూడా గెలిపించాలని జీవన్ రెడ్డి శ్రీధర్ బాబును డిమాండ్ చేశారు. లేదంటే నిన్ను జగిత్యాలలో అడుగు పెట్టనివ్వనని ధర్మపురి వరకే నీ అధికారం అంటూ శ్రీదర్ బాబును నవ్వుతూ హెచ్చరించారు. టిఆర్ఎస్ దోపిడీ పాలన అంతం చేసినట్టు మరోసారి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి యువకుడైన వంశీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణను నిరుద్యోగ రాష్ట్రంగా మార్చారని నేను అలా కాదన్నారు. స్వయంగా పారిశ్రామికవేత్తను అయిన నేను యువతకు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశి హామీ ఇచ్చారు.