👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నడూ ధర్మపురి నియోజక వర్గ రైతాంగానికి గురించి ఆలోచించలేదు , వారి సంక్షేమం గురించి పట్టించుకోలేదు. అని ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ గురువారం నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ. నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ రమణ రావు ,ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు , కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నరసింహారావు, పెద్ధపెల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీ పాల్గొన్నారు.

సమావేశానికి ముందు పెద్ధపెల్లి పార్లమెంట్ ఎంపి అభ్యర్థి వంశీ , ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
కరీంనగర్ జిల్లాకు తలపున గోదావరి ఉన్న మన నీళ్ళు మనకు రాకుండా సిద్దిపేటకు గజ్వేల్ కి నీళ్ళు తీసుకెళ్ళిన నాడు మంత్రి హోదాలో కొప్పుల ఈశ్వర్ నోరు విప్పలేదన్నారు.
కాళేశ్వరం లింక్ 2 పేరుతో పేద రైతులకు సంబందించిన భూములను బలవంతంగా పోలీసులను పెట్టీ లాక్కున్న మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ రైతుల గురించి ఎన్నడూ పట్టించుకోని ఈశ్వర్ ఇప్పుడు రైతుల గురించి దొంగ దీక్షలు చేస్తున్నారని హేళన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన 5 న్యాయలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ ని బారి ఓట్లుమెజారిటీతో గెలిపించాలని లక్ష్యం కుమార్ విజ్ఞప్తి చేశారు.