మాజీ స్పీకర్ శ్రీపాదరావు, అభివృద్ధి ప్రదాత, అజాత శత్రువు!

👉శ్రీపాదరావు 25 వర్ధంతి సభలో పలువురు వక్తలు.!

J.SURENDER KUMAR,


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ అభివృద్ధి ప్రదాత అజాత శత్రువు, అని పలువురు స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు  25వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి ప్రసంగించారు.


శనివారం  మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో స్వర్గీయ మాజి స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు  25వ వర్ధంతి సందర్భంగా  ఆయన కుమారుడు మంత్రి శ్రీధర్ బాబు శ్రీపాద రావు  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్  ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ , బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్,  మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,  చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్,  పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి  గడ్డం వంశీకృష్ణ ,  మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొని శ్రీపాదరావు ఈ ప్రాంతానికి చేసిన సేవలను అభివృద్ధిని వారు తమ తమ ప్రసంగాలలో వివరించారు.

ఈ సందర్భంగా తాళ్ల పెళ్లి నారాయణ గౌడ్ స్వర్గీయ శ్రీపాదరావుపై రాసి గానం చేసిన పాటల సీడీ ని మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.