👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా గడ్డం వంశీకృష్ణ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెద్దపెల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శనివారం ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమ్మేళనంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. సమావేశ ప్రారంభానికి ముందు శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాద రావు 25 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. మరో రెండు గ్యారెంటీలను అతి త్వరలోనే అమలు అమలు చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి పెద్దదిక్కు వంటి వెంకట స్వామి గ మనుమడు వంశీ ని పెద్దపెల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని, భారీ మెజారిటీతో పెద్దపెల్లి ఎంపిగా గెలిపించడం కోసం కలిసికట్టుగా మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో కృషి చేస్తామని లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..

ధర్మపురిలో మాజీ శాసనసభ స్పీకర్ దుద్ధిల్ల శ్రీపాదరావు వర్ధంతి..
ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కీర్తిశేషులు దుద్దిల్ల శ్రీపాద రావ్ 25వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి, కాంగ్రెస్ నాయకులు వేముల రాజేష్ , చిలుముల లక్ష్మన్, జక్కు రవీందర్, సింహరాజు ప్రసాద్ , అశెట్టి శ్రీనివాస్, వొజ్జల లక్ష్మణ్, సుముఖ్, సత్తన్న , రఫ్ఫియొద్దీన్, శ్రావణ్, అభి, రాపర్తి సాయి, బొడ్ల శ్రీను, భరత్, కాషెట్టి రాజు, రమణ, క్రాంతి, గోపి, గణేష్, సాగర్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు