మా ప్రభుత్వం క్రీడాకారులకు చేయూతనిచ్చి ప్రోత్సహిస్తుంది!

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మా ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించి చేయూత అందిస్తుందని, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

క్రీడాకారిణి విరంచి స్వప్నికకు, సంఘనపట్ల దినేష్, ఇందారపు కిరణ్ మిత్ర బృందం సేకరించిన ₹ 2 లక్షల నగదును మంగళవారం ధర్మపురిలో ఆమెకు అందించి ఎమ్మెల్యే సన్మానించారు.

ధర్మపురి పట్టణం కు చెందిన పవర్ లిఫ్టర్ విరంచి స్వప్నిక మే మాసంలో జరగనున్న హాంకాంగ్ లో జరగనున్న పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆమె పాల్గొననున్నది.
గతంలో పలు పోటీల్లో గెలుపొంది సుమారు 45 మెడల్స్ ను స్వప్నిక సాధించింది.


👉ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ,₹ 50. వేల ఆర్థిక సహాయం !


క్రీడాకారులను ప్రోత్సహించడానికి. ఆర్థిక సహాయం అందించిన దినేష్, కిరణ్ మిత్ర బృంద సభ్యులను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అభినందిస్తూ, వ్యక్తిగతంగా తన వంతు గా స్వప్నిక కు ₹ 50 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
భవిష్యత్తులో ప్రభుత్వం నుండి కూడా స్వప్నికకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారుల అభ్యున్నతికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని,ధర్మపురి నియోజకవర్గ క్రీడాకారులను ప్రోత్సహించెందుకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.


ముందు ఉగాది సందర్భంగా స్థానిక శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింహ రాజు ప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాందెని మొగిలి, జక్కు రవి, NSUI అసెంబ్లీ అధ్యక్షులు అప్పం శ్రావణ్, టౌన్ యూత్ అధ్యక్షులు అప్పం తిరుపతి, వొజ్జల లక్ష్మణ్, సుముక్, అశేట్టి శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు